రియల్‌మి జీటీ 5జి పేరిట ఓ నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అమర్చారు. 5జి ఫీచర్ లభిస్తుంది. ఫోన్ వేడి కాకుండా కూలింగ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. 12 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. అవసరం అనుకుంటే ర్యామ్‌ను 7 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. 65 వాట్ల సూపర్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను ఇందులో ఇచ్చారు. దీని వల్ల ఫోన్ కేవలం 35 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ అవుతుంది.
ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో విడుదలైంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 8జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.37,999 ఉండగా, 12 జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.41,999గా ఉంది.
ఆగస్టు 25వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లో లభిస్తుంది. లాంచింగ్ ఆఫర్ కింద ఐసీఐసీఐ కార్డులతో కొంటే రూ.3000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.