Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్కెట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే..

Advertiesment
మార్కెట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే..
, ఆదివారం, 15 ఆగస్టు 2021 (17:22 IST)
మార్కెట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా కంపెనీ ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఎస్‌1‌, ఎస్‌1 ప్రో అనే రెండు వేరియంట్లలో ఓలా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
రివర్స్‌ మోడ్‌లో వస్తున్న అతికొద్ది ద్విచక్రవాహనాల్లో ఇదొకటి. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 181 కి.మీ(ఎస్‌1 ప్రో) వరకూ ప్రయాణించవచ్చు. 115 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకోగలదు. బిల్ట్‌ ఇన్‌ స్పీకర్స్‌, స్మార్ట్‌ ఫోన్‌తో లాక్‌-అన్‌లాక్‌ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉండటం ప్రత్యేకత. 
 
అంతేకాకుండా, కేవలం మూడు సెకన్లలో గంటకు 40 కి.మీ. వేగాన్ని.. ఐదు సెకన్లలో 60 కి.మీ వేగాన్ని అందుకునే సామర్థ్యం ఈ స్కూటర్ సొంతం. అలాగే, ఎస్‌1 ప్రారంభ ధర రూ.99,999, ఎస్‌1 ప్రో ధర రూ.1,29,999. ఫేమ్‌ రాయితీ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. ఢిల్లీలో దీని ధర రూ.85,099, గుజరాత్‌లో రూ.79,999, మహారాష్ట్రలో రూ.94,999, రాజస్థాన్‌లో రూ.89,968.
 
మరోవైపు, ఎస్‌1 ప్రో లో 3.97 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, ఎస్‌1లో 2.98 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీని పొందుపరిచారు. పూర్తిగా ఎల్‌ఈడీ లైట్లు. మొత్తం 10 రంగుల్లో అందుబాటులో ఉంది. మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా లాక్‌-అన్‌లాక్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. నార్మల్‌, స్పోర్ట్‌, హైపర్‌ అనే మూడు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. స్క్రీన్‌లో ఉండే ‘మూడ్స్‌’ అనే ఫీచర్‌లో పలు రకాల ఒడోమీటర్‌ సెట్టింగ్‌లను పొందొచ్చు. ‘బిల్ట్‌ ఇన్‌ స్పీకర్ల’తో ఫోన్‌ కాల్స్‌ కూడా రిసీవ్‌ చేసుకోవచ్చు. ఇలాంటి అనేక ప్రత్యేకతలు దీని సొంతం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ అమ్మాయి మేజర్.. ఆమె ఇష్టంతోనే నా క్లయింటే సెక్స్ చేశాడు...