Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాప్ ఎక్కువవుతోందని విక్టరీ వెంకటేష్ ఆ పని చేస్తున్నాడట...

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి ఎఫ్ 2 సినిమా చేస్తున్నారు. హ్యాట్రిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (11:24 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి ఎఫ్ 2 సినిమా చేస్తున్నారు. హ్యాట్రిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు వెంకీ, మేన‌ల్లుడు నాగచైత‌న్య‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ మూవీకి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పైన  రూపొందుతోన్న ఈ మూవీకి వెంకీ మామ అనే టైటిల్ ఖ‌రారు చేసారు.
 
ఈ రెండు సినిమాల త‌ర్వాత‌ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. అలాగే నేను లోక‌ల్, హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రాల ద‌ర్శ‌కుడు న‌క్కిన త్రినాధ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. దీనికి ప్ర‌స‌న్న‌కుమార్ క‌థ అందిస్తున్నారు. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.
 
ఈ మూవీ త‌ర్వాత‌ తొలిప్రేమ‌, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ని తెలిసింది. తాజా వార్త‌ ఏంటంటే… బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఇటీవ‌ల వెంకీకి ఓ క‌థ చెప్పాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చెయ్ అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌.
 
గురు సినిమా త‌ర్వాత వెంకీ పూరి, క్రిష్, కిషోర్ తిరుమ‌ల‌, తేజ‌ల‌తో సినిమాలు చేయాల‌నుకున్నాడు కానీ కుద‌ర‌లేదు. అందుకే కెరీర్లో బాగా గ్యాప్ వ‌చ్చింది. ఇక అలా గ్యాప్ రాకూద‌ని వ‌రుస‌గా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అదీ.. సంగ‌తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వయంగా కారు నడుపుతూ కనిపించిన కేసీఆర్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఖుషీ (video)

తెలంగాణలో చలి: కొమరం భీమ్ జిల్లాలో వణికిపోతున్న జనం

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

రఘురామకృష్ణంరాజు కేసు.. రిటైర్డ్ సీఐడీ ఏఎస్పీ అరెస్ట్.. ఇవన్నీ జరిగాయా?

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments