Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో రజనీ-ప్రభాస్‌ ఇద్దరూ ఒకటేనంటున్నారు...

సాధారణంగా తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక విధమైన ట్రెండ్‌ని ఫాలో అవుతూంటారు. సంవత్సరానికి రెండుమూడు సినిమాలు చేసేయకుండా... రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూంటారు. రెండు మూడు సంవత్సరాలుగా సినిమాలేవీ లేవు కాబట్టి ఓపెనింగ్స్ పెద్ద ఎత్తున ఉంటాయి

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (11:11 IST)
సాధారణంగా తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక విధమైన ట్రెండ్‌ని ఫాలో అవుతూంటారు. సంవత్సరానికి రెండుమూడు సినిమాలు చేసేయకుండా... రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూంటారు. రెండు మూడు సంవత్సరాలుగా సినిమాలేవీ లేవు కాబట్టి ఓపెనింగ్స్ పెద్ద ఎత్తున ఉంటాయి. తెలుగునాట ప్రభాస్ పరిస్థితి కూడా అదేవిధంగా తయారైందంటున్నారు సినీ విశ్లేషకులు. మొన్నటిదాకా బాహుబలి పేరుతో తెరకు దూరంగా ఉండిన ప్రభాస్ తర్వాత ఎప్పుడో ప్రకటించిన సాహో ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాకపోవడం గురించి ఈ విధమైన చర్చ జరుగుతోంది. 
 
ఎటుతిరిగీ జియో వారి పుణ్యమా అని దానితో పోటీ పడిన మిగిలిన నెట్‌వర్క్‌ల పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫ్రీ ఇంటర్నెట్‌ని తెగ వాడేస్తున్నారు. ఇటువంటి సీజన్‌లలో ఇప్పుడొక టీజర్ అప్పుడొక ఫస్ట్‌లుక్ పేరుతో రిలీజ్ చేస్తూంటే డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఒకటి ఉందని ఆలోచించే టైమ్ కూడా లేని కుర్రకారు పదేపదే చూసేస్తూంటే వచ్చే క్లిక్‌ల దృష్ట్యా మా సినిమా టీజర్ ఇన్ని క్లిక్‌లను కొల్లగొట్టింది, మా సినిమా ఫస్ట్‌లుక్‌కి ఇన్ని క్లిక్‌లొచ్చాయని ప్రకటించేసుకునే అభిమాన సంఘాలు ఇన్నన్ని రోజుల తర్వాత వచ్చే సినిమాని మాత్రం ఎందుకు వదిలిపెడతారు. తద్వారా ఈ విధంగా వచ్చే ఏ సినిమా అయినా బాక్సాఫీస్ కొల్లగొడుతుందనేది ఒక విశ్లేషణాత్మక నిజం.
 
కాగా, ఒక్కొక్క సినిమాకి ఇంత గ్యాప్‌లు తీసుకోవడం కోట్లల్లో రెమ్యూనరేషన్లు తీసుకునే బడాబాబులకు మంచిదేమోగానీ, ఏదో సినిమాలో పని చేస్తే తప్ప కడుపు నింపుకోలేక పొట్ట చేతపట్టుకొని తిరిగే సినీ పరిశ్రమలోని చిన్నచిన్న శ్రామికుల గోడు వినేది ఎవరనేదే ఇక్కడ చర్చనీయాంశం. మరి ప్రభాస్ ఆలోచిస్తాడేమో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments