Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ర‌కుల్ ప్రీత్ సింగ్ వెనుక క్యూ క‌డుతున్న ఆఫ‌ర్స్

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ జాబితాలో ఉన్న ర‌కుల్ చివ‌రిగా తెలుగులో 'స్పైడర్' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ ర‌కుల్‌కి కాస్త దెబ్బ కొట్టిన ఆఫ‌ర్స్ ఏ మాత్రం త‌గ్గడం లేదు.

Advertiesment
ర‌కుల్ ప్రీత్ సింగ్ వెనుక క్యూ క‌డుతున్న ఆఫ‌ర్స్
, ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (11:26 IST)
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ జాబితాలో ఉన్న ర‌కుల్ చివ‌రిగా తెలుగులో 'స్పైడర్' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ ర‌కుల్‌కి కాస్త దెబ్బ కొట్టిన ఆఫ‌ర్స్ ఏ మాత్రం త‌గ్గడం లేదు.
 
తమిళ నటుడు సూర్యకు జంటగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం అందుకున్న ర‌కుల్‌ కార్తీతో మ‌రో సారి జ‌త‌క‌ట్టింది. కొత్త దర్శకుడు రజత్‌ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ సినిమా చిత్రీకరణ సమ్మె కారణంగా ఆగిపోయింది. 
 
ఈ నేపథ్యంలో శనివారం నుంచి మళ్లీ మొదలైంది. ఇక 'అయారీ' అనే హిందీ చిత్రంతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌కుల్ త‌ర్వ‌లో ఆజయ్‌దేవ్‌గన్‌తో మరో చిత్రం చేయనుందని స‌మాచారం. 
 
కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్‌తో కూడా ర‌కుల్ జ‌త‌క‌ట్ట‌నుంద‌నే వార్త వైర‌ల్‌గా మారింది. శివకార్తికేయన్‌ ప్రస్తుతం పోన్‌రామ్‌ దర్శకత్వంలో 'సీమరాజా' చిత్రంలో నటిస్తున్నారు. స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ ఈ చిత్రం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. 
 
ఈ మూవీ పూర్తి కాగానే 'ఇండ్రు - నేట్రు - నాళై' చిత్రం ఫేమ్‌ రవికుమార్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సైంటిఫిక్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంకి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. జూన్ చివ‌రి వారంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్?