Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 28 February 2025
webdunia

రకుల్ ప్రీత్ సింగ్‌పై శివాలెత్తిన శ్రీరెడ్డి.. చాలామంది కడుపుమంటతో?

టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్న శ్రీరెడ్డిపై.. టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మండిపడిన సంగతి తెలిసింది. శ్రీరెడ్డి ఏమైనా పెద్ద హీరోయిన్ అనుకుంటుందా... అంటూ రకుల్ ప్రీత్ సింగ్ మండి

Advertiesment
రకుల్ ప్రీత్ సింగ్‌పై శివాలెత్తిన శ్రీరెడ్డి.. చాలామంది కడుపుమంటతో?
, గురువారం, 29 మార్చి 2018 (10:53 IST)
టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్న శ్రీరెడ్డిపై.. టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మండిపడిన సంగతి తెలిసింది. శ్రీరెడ్డి ఏమైనా పెద్ద హీరోయిన్ అనుకుంటుందా... అంటూ రకుల్ ప్రీత్ సింగ్ మండిపడింది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దీనిపైనే ప్రస్తుతం చర్చించుకుంటోంది. ఇది తలచుకుంటే తనకు బాధగా వుందని చెప్పుకొచ్చింది. 
 
తాను ముంబైని వదిలి హైదరాబాదులో వున్నానంటే.. ఇక్కడి వాతావరణం ఎలా వుందో అర్థం చేసుకోవాలని.. తమ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం బాగా తెలుసునని తెలిపింది. రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై తాజాగా శ్రీరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
తాను ఉత్తరాది నుంచి ఇక్కడకు దిగిరాలేదని స్పష్టం చేసింది. అమ్మా.. మీరు స్టార్ హీరోయిన్ అయిపోయారని.. మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారని.. కోట్ల కొద్దీ డబ్బు వుందని నచ్చినట్లు మాట్లాడకండని శ్రీరెడ్డి తెలిపింది. ఇక్కడ చాలామంది కడుపుమంటతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. వారికోసమే తాను మాట్లాడానని తెలిపింది. 
 
తాము కడుపునిండా తినడం కోసం కష్టపడుతున్నామని వెల్లడించింది. తామేమీ పబ్లిసిటీ కోసం లేనిపోనివి మాట్లాడడం లేదని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. నిజాలే మాట్లాడుతున్నామని మరోసారి స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#NTRBiopic : సోదరా దుశ్శాసనా... మామా గాంధార సార్వభౌమా...