Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు గులెక్కి, దూలెక్కి, జనసేనలో పని చేశా... పవన్‌తో ఆ పని చేయంచండంటూ దిలీప్ సవాల్

కళ్యాణ్ దిలీప్ సుంకర ఒక్కసారిగా జనసేన పార్టీ పైన తిరుగుబాటు ఎగురేశారు. పవన్‌ కళ్యాణ్ వీరాభిమానిగా ఆయనకు పేరున్న సంగతి తెలిసిందే. దిలీప్ జనసేన పార్టీకి అత్యంత విధేయుడిగా పేరున్న సంగతి తెలిసిందే. మీ బతుకులకు పార్టీ ఆఫీసుల్లో బల్లలూ, ప్రెస్ మీట్లా అంటూ

Advertiesment
నాకు గులెక్కి, దూలెక్కి, జనసేనలో పని చేశా... పవన్‌తో ఆ పని చేయంచండంటూ దిలీప్ సవాల్
, మంగళవారం, 27 మార్చి 2018 (21:51 IST)
కళ్యాణ్ దిలీప్ సుంకర ఒక్కసారిగా జనసేన పార్టీ పైన తిరుగుబాటు ఎగురేశారు. పవన్‌ కళ్యాణ్ వీరాభిమానిగా ఆయనకు పేరున్న సంగతి తెలిసిందే. దిలీప్ జనసేన పార్టీకి అత్యంత విధేయుడిగా పేరున్న సంగతి తెలిసిందే. మీ బతుకులకు పార్టీ ఆఫీసుల్లో బల్లలూ, ప్రెస్ మీట్లా అంటూ జనసేన అధికార ప్రతినిధులను తూర్పారబట్టారు. దిలీప్‌కు సోషల్ మీడియా, టీవీ డిబేట్ల ద్వారా మంచి ఫాలోయింగ్ వున్న సంగతి తెలిసిందే. 
 
ఐతే పార్టీకి సంబంధించి దిలీప్‌కు ఎలాంటి పదవి ఇవ్వకపోవడం వెనుక అనేక కారణాలున్నాయని పార్టీకి చెందినవారు కొందరు ప్రచారం చేయడంపై కళ్యాణ్ దిలీప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు. బూతు పురాణం అందుకున్నాడు. వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగా పేరున్నప్పటికీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జాబితాలో మాత్రం దిలీప్‌కు చోటు లభించలేదు. ఐతే కళ్యాణ్ దిలీప్ మాత్రం తనకు ఎలాంటి పదవి రాకపోయినా అసంతృప్తి లేదని వెల్లడించారు. 
 
కానీ ఇటీవల తను హీరో శివాజీకి సంబంధించి ఓ మీడియా సమావేశానికి హాజరయినప్పుడు జనసేన పీఆర్వో వేణు టీవీ చానెళ్లకు ఫోన్లు చేసి తనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంపై విరుచుకపడ్డారు. ఆయనపై లైవ్ చాట్లో తిట్ల దండకం అందుకున్నారు. పవన్ కళ్యాణ్ కు ఇదంతా తెలిసి జరుగుతుందో లేదో తనకైతే తెలియదనీ, జనసేన పేరు చెప్పుకుని ప్రాపగాండా సాధించుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అన్నాడు. జనసేన అవసరం లేకుండానే రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఎదగగలనని వెల్లడించాడు. మొత్తమ్మీద జనసేన పార్టీకి తిరుగుబాట్లు మొదలైనట్లు వున్నాయి. మరి పవన్ కళ్యాణ్ వీటిని ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ టూరిజం ద్వారా 5 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు రూ. 10,000 కోట్లు ఆదాయం