Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్‌తో కలిసి నటించాలన్న కోరిక ఉంది.. కానీ మంచి కథ కుదరాలి : వరుణ్ తేజ్

ఠాగూర్
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (13:07 IST)
తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలన్న కోరిక ఉందని, కానీ, తమకిద్దరికి సూటయ్యే కథ కుదరాలని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇందులో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ కథానాయికగా నటించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. భారత వాయుసేన నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. మార్చి ఒకటో తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ వాలంటైన్ చిత్రం బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. 
 
ఈ క్రమంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని మల్లారెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలని ఎవరికి మాత్రం ఉండదన్నారు. కానీ, తామిద్దరం కలిసి నటించాలంటే సరైన కథ కుదరాలి కదా అని అన్నారు. కథ దొరికితే బాబాయ్‌తో సినిమా చేస్తాను అని తెలిపారు. వాయుసేన నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి చిత్రం ఇదేనని తెలిపారు. కామెడీ సినిమాలు వంద చేసినా దేశం కోసం చేసిన సినిమా ఎంతో గొప్పగా ఉంటుందని వరుణ్ చెప్పారు. 
 
ఇకపోతే, ఇటీవల ఓ ఇంటివాడైన వరుణ్ తేజ్ తన అర్థాంగి లావణ్య త్రిపాఠి పేరును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీ అభిమాన హీరోయిన్ ఎవరని ప్రశ్నించగా, నా అభిమాన హీరోయిన్‌నే తాను పెళ్లి చేసుకున్నానంటూ చమత్కరించారు. లావణ్య తర్వాత తాను ఎక్కువగా అభిమానించే హీరోయిన్ సాయిపల్లవి అని చెప్పారు. మంచి కథలు దొరికితే లావణ్య, తాను కలిసి నటిస్తామని వరుణ్ తేజ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments