Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సలార్ ఎఫెక్ట్.. శ్రీయా రెడ్డికి ఛాన్సులే ఛాన్సులు.. పవన్ కళ్ళు పవర్ ఫుల్

Advertiesment
Shriya Reddy

సెల్వి

, గురువారం, 1 ఫిబ్రవరి 2024 (14:01 IST)
తెలుగులో ఓజీ సినిమాతో సలార్ స్టార్ శ్రియా రెడ్డి బిజీగా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తున్న తరహా పాత్రలో.. ఇకపై శ్రీయా రెడ్డి కూడా కనిపించే ఛాన్స్ వుందనే వార్తలు వస్తున్నాయి. పొగరు సినిమా తర్వాత మళ్లీ ఆమె సలార్ లోనే అంతటి ఫవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తోంది. ఈ సినిమాకు తర్వాత శ్రీయారెడ్డికి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయని టాక్ వస్తోంది. 
 
ఇంకా ఓజీ గురించి శ్రీయా రెడ్డి మాట్లాడుతూ, "సుజిత్ భావోద్వేగాలు చాలా బలంగా ఉండాలని కోరుకున్నాడు. OGలో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీతో సహా సమిష్టి తారాగణం ఉంది. వారి ప్రదర్శన చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సార్ కంపర్ట్ పర్సన్. అతని కళ్ళు చాలా శక్తివంతమైనవి." అని తెలిపింది. 
 
ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ బాణీలు సమకూరుస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడపలో సందడి చేసిన సూపర్‌స్టార్ రజినీకాంత్