Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమీ మారలేదు : లావణ్య త్రిపాఠీ

Lavanya Tripathi

డీవీ

, శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (17:00 IST)
Lavanya Tripathi
లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ "మిస్ పర్ఫెక్ట్". ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా నటించారు. "మిస్ పర్ఫెక్ట్" వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఇవాళ్టి నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో "మిస్ పర్ఫెక్ట్" స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సిరీస్ హైలైట్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపింది హీరోయిన్ లావణ్య త్రిపాఠీ.
 
- "మిస్ పర్ఫెక్ట్"లో మంచి యాక్టర్స్ ఉన్నారు. అయితే నేను ఈ సిరీస్ మాట్లాడాలంటే ముందు స్క్రిప్ట్ గురించే చెప్పాలి. రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసిన గుడ్ స్క్రిప్ట్ ఇది. ఇలాంటి స్క్రిప్ట్ నాకు రావడం హ్యాపీగా ఉంది. ఇందులో రెగ్యులర్ గా చూసే కామెడీ ఉండదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి.  ఈ వెబ్ సిరీస్ లో నేను మిస్ లావణ్య, లక్ష్మీ అనే క్యారెక్టర్స్ లో నటించాను. ఆమె ఒక పర్ఫెక్షనిస్ట్. అలా ప్రతి పనిలో పర్ఫెక్ట్ గా ఉండాలనుకోవడం కొన్ని ఇబ్బందులు తీసుకొస్తుంది. ఈ క్యారెక్టర్స్ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఒక నటిగా నేను భిన్నమైన రోల్స్ చేయాలని కోరుకుంటాను. ఆ క్రమంలో నాకు "మిస్ పర్ఫెక్ట్" లో చేసే ఛాన్స్ దక్కింది.
 
- నేను నటించిన మిస్ లావణ్య, లక్ష్మీ క్యారెక్టర్స్ నా పర్సనల్ లైఫ్ కు దగ్గరగా ఉంటాయి. నేను రియల్ లైఫ్ లో కొద్దిగా ఈ క్యారెక్టర్స్ తో రిలేట్ చేసుకోగలను. ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీలా ఉంటాను. సెట్ లో లావణ్య క్యారెక్టర్ లా పర్పెక్షన్ కోరుకుంటాను. నేను అడిగి మరీ సెకండ్ టేక్స్ చేస్తుంటాను. సినిమాలకు వెబ్ సిరీస్ కు పెద్ద తేడా ఏం కనిపించలేదు. "మిస్ పర్ఫెక్ట్" షూటింగ్ ఒక సినిమాకు జరిగినట్లే అనిపించింది. అయితే ఇక్కడ 30 డేస్ షూట్ తో కంప్లీట్ చేశాను. సినిమాకు అయితే ఏడాది పాటు వర్క్ చేయాల్సివస్తుంది.
 
- వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమీ మారలేదు. మెగా కుటుంబంలోకి వచ్చాక నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి అని నాకు ఎవరూ చెప్పడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ లాంటి అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ ఉన్నాడు. మిగతా వాళ్లు నన్ను చూసే విధానంలో తేడా ఉందేమో. మా వరకు గతంలోలాగే ఉన్నాం. ఒక పెద్ద ఫ్యామిలీలోకి అడుగుపెట్టడం గుడ్ ఫీలింగ్ ఇచ్చింది. "మిస్ పర్ఫెక్ట్" సిరీస్ ను వరుణ్ చూసి మంచి క్వాలిటీతో బాగుందని చెప్పాడు. తనకు సిరీస్ మొత్తం నచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేశాడు. వరుణ్, నేను ఎవరి ప్రొఫెషనల్ వర్క్ వాళ్లం ముందుకు వెళ్తాం. నేను చేసే ప్రాజెక్ట్స్ లో తను ఇన్వాల్వ్ కాడు. నేను ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ గురించి చెబితే వింటాడు. ఈ సిరీస్ స్క్రిప్ట్ వరుణ్ కు తెలుసు. చదివి బాగుందని చెప్పాడు.
 
- కొత్త డైరెక్టర్స్ తో వర్క్ చేయడం ఎప్పుడూ రిఫ్రెషింగ్ గా ఉంటుంది. విశ్వక్ ఖండేరావ్ రైటింగ్ యూనిక్ గా ఉంటుంది. అతనితో వర్క్ చేయడం హ్యాపీగా ఫీలయ్యా. సెట్ లో ఎవరి ఓపీనియన్ అయినా తీసుకునేవారు. నేను చెప్పే సజెషన్స్ వినేవారు. పర్పెక్షనిస్ట్ గా ఉండటం ఎలా ప్రాబ్లమ్ అయ్యింది అనేది మీరు ఈ సిరీస్ లో చూస్తారు.
 
- "మిస్ పర్ఫెక్ట్" సిరీస్ లో నటించడం ఎక్కడా ఛాలెంజింగ్ అనిపించలేదు. పైగా ఇది చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. నేను పులి మేక సిరీస్ తర్వాత మరో థ్రిల్లర్ మూవీ చేశాను. తమిళ్ లో ఒక డార్క్ థ్రిల్లర్ లో నటించాను. ఇలా యాక్షన్, థ్రిల్లర్స్ తర్వాత ఇలాంటి ఒక రోమ్ కామ్ చేయడం చాలా ఈజీగా అనిపించింది. డైరెక్టర్ విశ్వక్ డైలాగ్ డెలివరీ క్యాచ్ చేయడం ఒక్కటే ఇబ్బందిగా ఉండేది. నేను సినిమాల ఎంపికలో ఎప్పుడూ సెలెక్టివ్ ఉంటూ వచ్చాను. ఎక్కువ సినిమాల్లో నటించాలని ఆరాటపడలేదు. ఒకేసారి రెండు మూడు ప్రాజెక్ట్స్ ఎప్పుడూ ఎంచుకోలేదు. చేసినవి తక్కువ మూవీసే అయినా నటిగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించా.
 
- లక్కీగా నేను ఇప్పటిదాకా మంచి ప్రొడక్షన్ కంపెనీస్ లోనే వర్క చేశాను. హాట్ స్టార్ లో వర్క్ చేయడం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగింది. అలాగే అన్నపూర్ణ సంస్థ చేసింది. సుప్రియా నాకు మంచి స్నేహితురాలు. ఈ సిరీస్ కంఫర్ట్ గా చేశాను. నా నేటివ్ ప్లేస్ అయోధ్య . అక్కడ శ్రీరామ మందిరం కట్టడం గొప్ప విషయంగా చూస్తాను. శ్రీరాముడు అయోధ్య మందిరానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది.
 
- కొత్త హీరోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ఓ సినిమా ఫినిష్ చేశాను. అందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. ఒక తమిళ్ మూవీ చేస్తున్నా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్ తరుణ్ నటిస్తున్న తిరగబడరసామీ' నుంచి సెలబ్రేషన్ సాంగ్