Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్ట్రెస్ ఫీలయిన టైములో మిస్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రిలీఫ్ లా అనిపించింది : లావణ్య త్రిపాఠీ

Lavanya Tripathi, Abhijeet Duddala, Supriya Yarlagadda, Vishwak Khanderao

డీవీ

, మంగళవారం, 23 జనవరి 2024 (15:29 IST)
Lavanya Tripathi, Abhijeet Duddala, Supriya Yarlagadda, Vishwak Khanderao
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్.."మిస్ పర్ఫెక్ట్" అనే మరో సరికొత్త సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ,  అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటించారు. "మిస్ పర్ఫెక్ట్" వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో "మిస్ పర్ఫెక్ట్" స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ - కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం అంటే నాగార్జున గారికి, నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టం. అందుకే అన్నపూర్ణ సంస్థ పెట్టారు. ఈ సంస్థలో చాలా మంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చారు. న్యూ టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడమే ఈ సంస్థ ఉద్దేశం. "మిస్ పర్ఫెక్ట్" సిరీస్ తో మేము అదే ప్రయత్నం చేశాం. ఈ జర్నీలో హాట్ స్టార్ చాలా సపోర్ట్ చేసింది. అనురాధ, ఉదయ్ మాకు ఏ సమస్య వచ్చినా వెంటనే సాల్వ్ చేసేవారు. ఈ సిరీస్ కోసం చాలా మంది అమ్మాయిలు నో చెప్పిన క్యారెక్టర్ చేస్తానంటూ ముందుకు వచ్చి తన గట్స్ ఎంటో ప్రూవ్ చేసింది అభిజ్ఞ. బిగ్ బాస్ తో అభిజీత్ తెచ్చుకున్న గుర్తింపు మీకు తెలుసు. ఇందులో తను బాగా పర్ ఫార్మ్ చేశాడు. సోగ్గాడే చిన్ని నాయన టైమ్ నుంచి లావణ్యతో నాకు మంచి స్నేహం ఉంది. మిస్ పర్పెక్ట్ కు తనే పర్పెక్ట్ అనిపించింది. ఒక చిన్న కథలో బలమైన క్యారెక్టర్స్ ఉండి మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 2న "మిస్ పర్ఫెక్ట్" డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో చూడండి. అన్నారు.
 
హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ, ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను మిస్ పర్పెక్ట్. సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు మిసెస్ పర్పెక్ట్ అయ్యాను. ఈ సిరీస్ కు ముందు నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ కు  స్ట్రెస్ ఫీలయ్యాను. అలాంటి టైమ్ లో "మిస్ పర్ఫెక్ట్" లాంటి ఒక స్క్రిప్ట్ దొరకడం రిలీఫ్ లా ఫీలయ్యాను. శృతి, ఫ్రాన్సిస్ మీ ఇద్దరు సూపర్బ్ స్క్రిప్ట్ ఇచ్చారు. చదువుతున్నంత సేపు ఎంజాయ్ చేశాను. సుప్రియతో సోగ్గాడే చిన్ని నాయన మూవీకి వర్క్ చేశాను. ఆ సినిమా హిట్టయ్యింది. ఈ సిరీస్ కూడా అలాగే బిగ్ సక్సెస్ కావాలి. నాకు హాట్ స్టార్ అంటే చాలా ఇష్టం. సిరీస్, మూవీస్ చూస్తుంటాను. అభిజీత్ ను కూల్ స్టార్ అని పిలుచుకోవచ్చు. నువ్వు బాగా నటించావు అని చెబితే..నిజమా అని అడుగుతాడు. మా డైరెక్టర్ విశ్వక్ ఒక మిస్టర్ పర్పెక్ట్. డైలాగ్స్ సరిగ్గా చెప్పని సీన్స్ ఎన్నిసార్లైనా టేక్స్ చేయిస్తారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం. అభిజ్ఞ మంచి నటి. ఈ సిరీస్ లో తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. టైటిల్ కు తగినట్లే మా "మిస్ పర్ఫెక్ట్" పర్పెక్ట్ గా ఉంటుంది. హాట్ స్టార్ లో తప్పకచూడండి. అన్నారు
 
హీరో అభిజీత్ మాట్లాడుతూ,  అన్నపూర్ణ సంస్థలో పనిచేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. అధీప్ నా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఎక్కువ టైమ్ తీసుకోలేదు. తప్పకుండా చేస్తాను అన్నాను. అంత బాగా స్క్రిప్ట్ నచ్చింది. మా డైరెక్టర్ విశ్వక్ కు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ లో ఆడిషన్ ఇచ్చాను. ఆయన ఎంత పర్పెక్ట్ అంటే...ఏ సీన్ నచ్చకున్నా బాగా లేదని చెప్పడు. బాగుంది కానీ ఇంకో టేక్ చేద్దాం అంటాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వర్క్ చేయించుకున్నారు. లావణ్య గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ రైటర్స్ శృతి, ఫ్రాన్సిస్ ను ఇప్పటికి కలుసుకోవడం హ్యాపీగా ఉంది. మీరు ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ ఇచ్చారు. "మిస్ పర్ఫెక్ట్" ట్రైలర్ చూశాక...ప్రతి ఆర్టిస్ట్ బాగా పర్ ఫార్మ్ చేశారు. వారి పర్ ఫార్మెన్స్ లో నేను కనిపించకుండా పోతున్నానని అనిపించింది. నేను ఇండస్ట్రీలో ఉంటాను, ఉండాలి, ఉంటున్నాను అంటే కారణం నా ఫ్యాన్స్. వాళ్లు నా ఫ్యామిలీ. వాళ్లందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు కథలు తో రూపొందిన మూడోకన్ను విడుదల సిద్ధం