రాధిక నా తల్లి కాదు.. అయినా ఫ్రెండ్లీగా వుంటారు.. రహస్యాలను..? (Video)

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (10:06 IST)
సినీ నటి, శరత్ కుమార్ భార్య రాధిక గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వరలక్ష్మీ తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిందనే చెప్పాలి. జయమ్మగా సముద్రఖని సరసన ఆయనకు పోటీగా నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. 
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరలక్ష్మీ తన సవితి తల్లి రాధిక గురించి మాట్లాడుతూ.. 'ఆమె నా తల్లి కాదు. కానీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఓ ఫ్రెండ్‌లా ఉంటుంది. అంతేకాదు నా కెరియర్ కు సంబందించిన సూచనలు, గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే నేను ఎప్పుడైనా ఆమెకు ఏదైనా రహస్యం చెబితే.. మాత్రం దాన్ని వెంటనే అందరికీ లీక్ చేసేస్తుంది. 
 
అయితే అందులో దురుద్దేశం ఉండదు.. అలా పొరపాటున జరిగిపోతుంది. ఇలా నా రహస్యాలను లీక్ చేసి చాలా సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు అంటూ తన సవితి తల్లి రాధిక గురించి చెప్పుకొచ్చింది వరలక్ష్మి. ఇకపోతే.. విశాల్ బ్లాక్ బస్టర్ సినిమా పందెంకోడికి సీక్వెల్‌గా వచ్చిన 'పందెం కోడి 2′, ఆ తర్వాత విజయ్ హీరోగా వచ్చిన 'సర్కార్' వంటి చిత్రాల్లో లేడీ విలన్‌గా కనిపించి అదరగొట్టింది. 
 
ఇక తాజాగా రవితేజ, శృతి హాసన్‌లు హీరో హీరోయిన్స్‌గా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్‌లో నటించి తెలుగువారికి మరింత దగ్గరైంది. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments