Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఇన్ ద మార్నింగ్" కోసం దిగంబరంగా మారిన జెన్నిఫర్ లోఫెజ్

Advertiesment
, సోమవారం, 18 జనవరి 2021 (08:55 IST)
హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోఫెజ్. గతంలో టాలీవుడ్‌లోనూ ఓ చిత్రంలో నటించింది. ఆమె పాడిన "స్కెచ్ గీసిన‌ట్టుగా ఉందిరో ఈ సుంద‌రి" అనే పాట ఎంతో ప్రజాదారణ పొందింది. త‌న పాట‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. అంతేనా.. తరచుగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది.
 
తాజాగా ఈ ముద్దుగుమ్మ "ఇన్ ద మార్నింగ్" పేరుతో రూపొందిన పాట కోసం న‌గ్నంగా ఆడిపాడింది. ఇందులో జెన్నీఫ‌ర్‌ని చూసిన ఆమె అభిమానులు ముగ్దుల‌వుతున్నారు. జెన్నీఫర్ ఈ పాటకు ఫుల్ ప్ర‌మోష‌న్స్ చేసుకోగా, ఈ పాట‌కు సంబంధించిన ప్రోమోని కొద్ది రోజుల క్రితం విడుద‌ల చేసింది. 
 
దీనికి క్యాప్ష‌న్‌గా.. "నా క‌న్నా మిమ్మ‌ల్ని నేను ఎక్కువ ఇష్ట‌ప‌డుతుంటాను. నిన్ను నువ్వే మార్చుకోవాలి. నీకు నచ్చిన దాని కంటే విలువైనది కాని దాన్ని వదిలేసి రెక్కలు వికసించుకున్న పక్షిలా ఎగిరిపోవాలి" అంటూ జెన్నీఫర్  టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, పూర్తి వీడియో జనవరి 16న రిలీజ్ అయింది. 
 
51 ఏళ్ళ వ‌య‌స్సులోను జెన్నీఫ‌ర్ చేస్తున్న ఈ ర‌చ్చ‌పై సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. కాగా, జ‌న‌వ‌రి 20న అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌మాణ స్వీకారం రోజు జెన్నీ ఫ‌ర్ స్పెష‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో అల‌రించ‌నున్న విషయం తెల్సిందే. ఇందుకోసం ఆమె రూ.కోట్లలో పారితోషికం తీసుకోనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావ‌ళికి షాహిద్ క‌పూర్ `జెర్సీ`