Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నబిడ్డను బోటులో వదిలేసి నదిలో దూకి హాలీవుడ్ నటి సూసైడ్

Advertiesment
కన్నబిడ్డను బోటులో వదిలేసి నదిలో దూకి హాలీవుడ్ నటి సూసైడ్
, శుక్రవారం, 10 జులై 2020 (12:27 IST)
కన్నబిడ్డను బోటులో ఒంటరిగా వదిలివేసి హాలీవుడ్ నటి ఒకరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హాలీవుడ్ నటి సరస్సులో దూకడంతో ఆమె మృతదేహం కూడా గల్లంతైంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హాలీవుడ్ నటి, 'గ్లీ' ఫేమ్ నయా రివీరా బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ బోటును అద్దెకు తీసుకుంది. ఆపై తన కుమారుడితో కలిసి నదిలో విహారానికి వెళ్లింది. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని ఓ సరస్సులో దూకేంది.
 
అద్దెకు తీసుకున్న బోటులో ఆమె నాలుగేళ్ల కుమారుడు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన కొందరు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
రివీరా తన బిడ్డతో కలిసి బోటులో సరస్సులోకి విహార యాత్రకు వెళ్లింది. ఈ ఘటన లాస్ పాడ్రెస్ నేషనల్ ఫారెస్ట్‌లోని పిరూ లేక్‌లో జరిగింది. ఈ ప్రాంతం లాస్ ఏంజిల్స్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
మొత్తం 80 మంది రెస్క్యూ టీమ్, హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవల సాయంతో ఆమె కోసం గాలిస్తున్నారు. వీరిలో డైవర్లు కూడా ఉన్నారని ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గీతా ఆర్ట్స్‌లో డిజైనర్‌ అని మోసం చేశాడు.. బన్నీతో నటించే ఛాన్స్ ఇప్పిస్తానని?