Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

బావతో శృంగారం చేసి ఆ వీడియోలను అక్కకు చూపించిన చెల్లెలు

Advertiesment
young woman
, మంగళవారం, 7 జులై 2020 (20:56 IST)
బావపై మోజుపడ్డ మరదలు తన అక్క కాపురాన్ని కూల్చడమే కాదు, ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేసింది. పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టి చివరకు కటాకటాల పాలైంది. దీంతో రెండు కుటుంబాలు ఛిద్రమయ్యాయి. మహారాష్ట్రలోని భటిండాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
గురుగ్రాంకు చెందిన రేడ్చల్‌కు అదే ప్రాంతానికి చెందిన ప్రణీత్‌కు సరిగ్గా ఆరు నెలల క్రితం వివాహమైంది. ప్రణీత్ బాగా ఆస్తిపరుడు. రేడ్చల్ కుటుంబం మాత్రం మధ్యతరగతి కుటుంబం. ఎలాంటి కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నాడు. రేడ్చల్‌కు చెల్లెలు కూడా ఉంది.
 
కరోనా సమయంలో తన అక్క ఇంటికి వెళ్ళింది. మూడు నెలల పాటు అక్కడే ఉన్నారు. బావ ఆస్తి చూసి అతడిని ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని నిర్ణయించుకుంది. బావతో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. మద్యానికి బానిసైన ప్రణీత్‌కు పూటుగా మద్యం పోసి ఆ మత్తులో అతడితో శారీరకంగా కలిసింది.
 
గత నెలరోజుల నుంచే ఈ వ్యవహారం బాగా ముదిరింది. భార్య కన్నా భార్య చెల్లెలి పైనే ఎక్కువగా ప్రేమ చూపించడం మొదలుపెట్టాడు ప్రణీత్. విషయం కాస్తా మెల్లమెల్లగా రేడ్చల్ దృష్టికి వెళ్ళింది. అయితే బావతో పర్మినెంట్ ఉండాలని నిర్ణయించుకున్న రేడ్చల్ చెల్లెలు బావతో ఏకాంతంగా కలిసినప్పుడు వీడియోలు తీసుకుంది.
 
ఆ వీడియోలను అక్కకే చూపించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది రేడ్చల్. మనోవేదనకు గురై ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రణీత్‌ను విచారిస్తే అసలు విషయాన్ని బయటపెట్టాడు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహమ్మారి కమ్ముకున్న అనిశ్చితుల పెరుగుదల, పరుగులు తీస్తున్న పసిడి ధరలు