Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైఖేల్ జాక్సన్‌ ఎస్టేట్ అమ్ముడుపోయింది.. ఆయన కెరీర్‌లో ఓ మచ్చగా...?

మైఖేల్ జాక్సన్‌ ఎస్టేట్ అమ్ముడుపోయింది.. ఆయన కెరీర్‌లో ఓ మచ్చగా...?
, శుక్రవారం, 25 డిశెంబరు 2020 (13:10 IST)
దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌కు చెందిన నెవర్‌ల్యాండ్ ఎస్టేట్ అమ్ముడుపోయింది. కాలిఫోర్నియాలో ఉన్న ఆ ఎస్టేట్‌ను అమెరికాకు చెందిన బిలియనీర్ రాబ్ బర్క్లే ఖరీదు చేశారు. సుమారు 2.2 కోట్ల డాలర్లుకు నెవర్‌ల్యాండ్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. 2009లో మూన్‌వాకర్‌, కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. 
 
2700 ఎకరాలు ఉన్న నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను మైఖేల్ అత్యంత అద్భుతం తీర్చదిద్దారు. కానీ నెవర్‌ల్యాండ్ ఎస్టేట్ మైఖేల్ కెరీర్‌లో ఓ మచ్చగా కూడా మిగిలింది. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు మైఖేల్ ఇక్కడే పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మైఖేల్ జాక్సన్ మరణించిన తర్వాత నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను సైకామోర్ వాలీ రాంచ్‌గా పేరు మార్చారు.
 
మోంటానాకు చెందిన వ్యాపారవేత్త బర్క్లే.. జాక్సన్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. నిజానికి చాలా తక్కువ ధరకే జాక్సన్ స్థలం అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. 2015లో ఈ ఎస్టేట్‌ను వంద మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు ప్రయత్నాలు జరిగాయి. 
 
కానీ వ్యాపారవేత్త బర్క్లే కేవలం 22 మిలియన్ల డాలర్లకే ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకున్నట్లు ఆయన తరపు ప్రతినిధి వెల్లడించారు. నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను మైఖేల్ జాక్సన్ 1980 దశకంలో 20 మిలియన్ల డాలర్లకు ఖరీదు చేశాడు. అయితే మైఖేల్ మరణానికి ఏడాది ముందే ఆ ఎస్టేట్‌ను థామస్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ 23 మిలియన్ల డాలర్లకు సొంతం చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"క్రాక్" మూవీ నుంచి 'కోరమీసం పోలీసోడా' లిరికల్ సాంగ్ రిలీజ్