Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.58 వేల కోట్ల ఆస్తి గుప్తదానం : ఇపుడు మధ్యతరగతి వ్యక్తిలా జీవితం.. ఎవరు?

Advertiesment
Billionaire Charles Feeney Finishes
, గురువారం, 17 సెప్టెంబరు 2020 (08:25 IST)
అతనికున్న యావదాస్తిని రహస్యంగా దానం చేశాడు. కానీ, తన భార్య కోసం కేవలం కొంత మొత్తాన్ని ఉంచుకున్నారు. ఇంత చేసినా ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. ఆ తర్వాత ఆయన తన భార్యతో కలిసి ఓ మధ్య తరగతి వ్యక్తిలా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతకు యావదాస్తిని గుప్తదానం చేసిన వ్యక్తి పేరు చార్లెస్ చక్ ఫీనీ. వయసు 89 యేళ్లు. డ్యూటీ ఫ్రీ సహ వ్యవస్థాపకుడు. ఈయన ఆస్తి విలువ రూ.58 వేల కోట్లు. ఈ మొత్తాన్ని రహస్యంగా దానం చేశాడు. దాతృత్వంలో ఆనందాన్ని వెతుక్కున్న ఆయన తన ఆస్తి మొత్తాన్ని 'అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌' ద్వారా దానం చేయనున్నట్టు 2012లోనే ప్రకటించారు. ఆ ప్రకారంగా గుట్టుచప్పుడుకాకుండా దానం చేశాడు. ప్రపంచంలోని పలు ఫౌండేషన్లు, విశ్వవిద్యాలయాలకు తన ఆస్తిని దానంగా ఇచ్చేశారు. 
 
అయితే, ఈ విషయం ఇటీవల బయటకు రావడంతో ప్రపంచం మొత్తం అవాక్కయింది. తన భార్య కోసం మాత్రం 20 లక్షల డాలర్లు ఉంచుకున్నారు. దానంగా ఇచ్చిన దానిలో దాదాపు సగ భాగాన్ని విద్య కోసమే అందించారు. మిగతా దానిని మానవ హక్కులు, సామాజిక మార్పులు, ఆరోగ్య సమస్యలు వంటి అంశాల్లో తోడ్పడేందుకు ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్రీనీ మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా నేర్చుకున్నానని, తాను బతికి ఉండగానే ఈ మంచి కార్యక్రమం పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
 
ఫీని గుప్తదానంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ స్పందిస్తూ, తమ సంపాదన మొత్తాన్ని దానం చేసేందుకు చక్ తమకు ఓ దారి చూపించాడని, ఆస్తిలో సగం కాదు, మొత్తం దానం చేయాలంటూ తమలో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. కాగా, 58 వేల కోట్ల ఆస్తిని దానం చేసిన చక్ ఇప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ మామూలు ఆపార్ట్‌మెంట్‌లో భార్యతో కలిసి ఓ మధ్యతరగతి వ్యక్తిలా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా ఎంపీ మృతి పట్ల సీఎం జగన్ - చంద్రబాబు దిగ్భ్రాంతి