Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా ఇద్దరి మధ్య స్కూల్ డేస్ నుంచే 'ఆ' బంధం ఉంది : పాయిల్ రాజ్‌పుత్

Advertiesment
మా ఇద్దరి మధ్య స్కూల్ డేస్ నుంచే 'ఆ' బంధం ఉంది : పాయిల్ రాజ్‌పుత్
, ఆదివారం, 6 డిశెంబరు 2020 (09:23 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు "ఆర్ఎక్స్100" అనే చిత్రం ద్వారా పరిచయమైన ఢిల్లీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఈ ఒక్క చిత్రంతో ఈ అమ్మడుకు మంచి పేరు వచ్చింది. దీనికి కారణంగా ఇంతవరకు ఎవరూ చేయని సాహసం ఆమె చేయడమే. నెగెటివ్ టచ్ ఉన్న హీరోయిన్ పాత్రను చేసింది. ఫలితంగా ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది. అయితే, ఆ తర్వాత పాయల్ సినీ కేరీర్.. ఆశించినంతగా లేదు. ఈ క్రమంలో తన ప్రియుడు సౌరభ్ దింగ్రాను గురించి తాజాగా ఆమె వెల్లడించింది. 
 
గత ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రియుడు సౌరభ్‌ దింగ్రాను సోషల్‌ మీడియా ద్వారా అందరికి పరిచయం చేసింది. తామిద్దరికి స్కూల్‌ రోజుల నుంచి పరిచయం ఉందని.. కుటుంబ సభ్యులకు కూడా తమ బంధం గురించి తెలుసునని పేర్కొంది. 
 
ఈ క్రమంలో పాయల్‌ రాజ్‌పుత్‌ శనివారం 28వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రేయసిని పొగడ్తలతో ముంచెత్తుతూ సౌరభ్‌దింగ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. ఈ ప్రపంచం మొత్తంలో తానే అత్యంత అదృష్టవంతుడనని.. తనకు చెంతన అద్భుత సౌందర్యరాశి కొలువుదీరి ఉందని ప్రశంసించాడు. 
 
'మబ్బుల తెరపై ప్రేమలేఖలు రాసి నీపై నాకున్న ప్రేమను అందరికి తెలియజేయాలనుంది. నా అదృష్టరాశివి నువ్వు. నా దేవతకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సౌరభ్‌ దింగ్రా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి తీయించుకున్న కొన్ని ఫొటోల్ని షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రేమజంట ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్నందరూ పక్కా హైదరాబాదీ అంటారు: ఎయిర్‌పోర్టులో హీరోయిన్ అమ్రిన్‌ ఖురేషి