కరోనాను ముందే గ్రహించిన మైకేల్ జాక్సన్..

శనివారం, 28 మార్చి 2020 (19:05 IST)
Michael Jackson
ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ మహమ్మారి గురించి ఇప్పటికే ముందుగానే గ్రహించిన దాఖలాలున్నాయి. అలాగే ప్రముఖ పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ ముందుగానే గ్రహించారట. ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వణికించే వైరస్ మహమ్మారి ఏదో ఒకటి వచ్చి కల్లోలం సృష్టిస్తుందని చెప్పినట్లు మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ మ్యాట్ ఫీడ్డెస్ వివరించాడు. 
 
కరోనా వలన ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మైకేల్ జాక్సన్ ఎప్పుడూ ఫేస్ మాస్కులు హ్యాండ్ గ్లవ్స్ ధరించేవాడని తెలిపాడు. వైరస్ వ్యాధులు రానున్నట్లు ముందే పసిగట్టి ఎప్పుడు ఆరోగ్యం విషయంలో మైకేల్ జాక్సన్ జాగ్రత్త వహించేవాడని చెప్పాడు. 
 
మైకేల్ జాక్సన్ తానెప్పుడూ రోగాల బారిన పడనని.. తన ఫ్యాన్స్‌ను నిరాశపరచనని చెప్పేవారని.. తాను ఉన్నంత కాలం తన అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తూనే వుంటానని తెలిపినట్లు తెలిపాడు. ఏదొక రోజు ప్రపంచమొత్తం సుక్ష్మ జీవుల బారిన పడి ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని జాక్సన్ చెప్పినట్లు మ్యాట్ ఫిడ్డెస్‌ చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనాకు విరాళం.. లక్ష ఇచ్చిన ప్రణీత... హీరోయిన్లలో ఆమే ఫస్ట్