Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనితా విజయకుమార్ ఇంట విషాదం: గుండెపోటుతో అక్క కుమార్తె మృతి

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (15:58 IST)
కోలీవుడ్ నటి వనితా విజయకుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది. ఈ విషయాన్ని వనితా విజయ్ కుమార్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. 
 
ఈ ఉదయాన్నే ఈ విషాదకర వార్తతో నిద్రలేచాను.. నా మేనకోడలు అనిత (20) మరణించింది. న్యూఢిల్లీలో సర్జరీ చేసుకున్న తర్వాత ఆమెకు గుండెపొటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నాకు దేవుడిచ్చిన కూతురు తను.. నాకు పెద్ద కూతురు వంటిది. 
 
మా నాన్న సోదరుడి కూతురు ఇంద్ర.. వాళ్లు ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నారు. ఇంద్ర చిన్న కూతురు అనిత. ఇంద్ర అక్క అంటే మా కుటుంబంలో అందరికి ఇష్టం.. అనిత దయాగుణం కలిగి  ఉండేది.. అన్నింటిని బాగా అర్థం చేసుకుంటుంది. నాకు ఎప్పుడు మద్దతుగా ఉంటుంది.
 
అలాగే నన్ను.. నా పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చింది.. కానీ మమ్మల్ని విడిచిపోయింది. తన తల్లిదండ్రులు సింగపూర్‌లో ఉండడం వలన తన మృతదేహాన్ని అక్కడికే పంపించాం. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాను. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. మేము ఈ అక్టోబరులో కలుద్దామనుకున్నాం.
 
తనను నా దగ్గరే 2 నెలలు ఉంచుకుందామనుకున్నాను. కరోనా లాక్డౌన్ కంటే ముందుగా గత రెండేళ్ల నుంచి కలుద్దామని ప్లాన్ చేస్తున్నాం. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. నా గుండె బద్ధలైది అంటూ పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments