Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నీళ్లు పెట్టుకున్న రిషబ్ పంత్, పృథ్వీ షా.. ఫోటోలు వైరల్

Advertiesment
Rishabh Pant
, గురువారం, 14 అక్టోబరు 2021 (19:36 IST)
Rishabh Pant
ఐపీఎల్ 2021 సీజన్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే ఎదురైంది. గత మూడేళ్లుగా టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఆ జట్టుకు ఈసారి కూడా కలిసిరాలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకున్న ఢిల్లీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లోనూ ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 3వికెట్లతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
 
గెలుపు కోసం చివరివరకు పోరాడిన ఢిల్లీకి నిరాశే ఎదురైంది. దాంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా ఉబికి వస్తున్న ఏడుపును ఆపుకోలేకపోయారు. 
 
గత మూడేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబర్చినా టైటిల్ అందుకోకపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు సైతం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాడ్ లక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైకి తప్పని టెన్షన్.. ఫైనల్ పోరులో కోల్‌కతాతో గెలుస్తుందా?