అది నా జీవితంలో ఓ మెమొరబుల్‌ మూమెంట్ - వంశీ పైడిప‌ల్లి..!

Webdunia
శనివారం, 11 మే 2019 (22:45 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన భారీ చిత్రం మ‌హ‌ర్షి. మే 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్స‌స్ మీట్‌లో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ... ”మహర్షి’ చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్స్‌. ఇదొక హార్ట్‌ హిట్టింగ్‌ ఫిల్మ్‌. ప్రతి ఒక్కరి మనసులోకి వెళ్ళి ఒక మంచి ఆలోచనను సృష్టిస్తుంది. మా సినిమాకి ఫస్ట్ నుండి సహకరించిన మీడియాకి ధన్యవాదాలు. ఈ విజయం నా రాబోయే చిత్రాలకు పాజిటివ్‌ ఎనర్జీని ఇస్తుంది. 
 
ఈ సినిమాతో నాకు ఫస్ట్ టైమ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ కాల్‌ చేసి అభినందిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఫోన్‌ చేసి వారు సినిమాలో ఏయే అంశాలకు కనెక్ట్‌ అయ్యారో చెబుతున్నారు. ఇదొక థాట్‌ ప్రొవోక్‌ సినిమా. ఇంటర్నల్‌గా మనం వెతుక్కునే సక్సెస్‌, అలాగే ఎక్స్‌టర్నల్‌గా ఒక సమాజానికి ఎలా ఉపయోగపడాలి అని రెండు పాయింట్లు చెప్పాం. 
 
ఏలూరు నుంచి ఎల్‌విఆర్‌గానీ, నెల్లూరు నుండి హరి గారు గానీ వీళ్లందరూ ఫోన్‌ చేసి థియేటర్ల సంఖ్య పెంచాం అని చెప్పారు. మహిళా ప్రేక్షకుల నుండి కూడా అప్రిషియేషన్‌ వస్తోంది. మహేష్‌ మొదటి నుండి ఈ సినిమా పై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు, ఆయన ఫ్యాన్స్‌ నిజం చేశారు. 
 
నిన్న మా టీమ్‌ అంతా సుదర్శన్‌ 35 థియేటర్‌లో సినిమా చూశాం. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. ఇండస్ట్రీ నుండి ఎన్నో కాల్స్‌ వస్తున్నాయి. మోస్ట్‌ స్పెషల్‌ కాల్‌ చిరంజీవిగారిది. పొద్దున కూర్చుని ఫోన్‌ చూస్తుంటే ఒక నెంబర్‌ వస్తోంది. ఎవరా అని లిఫ్ట్‌ చేస్తే.. ‘వంశీ’ అన్నారు. ఎవరండీ అనగానే… ‘నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను’ అన్నారాయన. 
 
అది వినగానే గూస్‌ బంప్స్‌ వచ్చాయి నాకు. మే 9న చిరంజీవిగారి ‘జగదేకవీరుడు’ సినిమా రిలీజైన రోజు నుండి నాకు సినిమాల పై ప్యాషన్‌ మొదలైంది. అదే డేట్‌ ‘మహర్షి’ రిలీజ్‌ అవ్వడం, అశ్వనీదత్ గారు కూడా ఈ సినిమాతో అసోసియేట్‌ అవ్వడం మర్చిపోలేనిది. సినిమా గురించి 5 నిమిషాలు మాట్లాడారు. ఇది నా జీవితంలో ఓ మెమొరబుల్‌ మూమెంట్‌.

ఆయన సినిమాలోని ప్రతి ఒక్క పాయింట్‌ గురించి మాట్లాడుతుంటే.. చాలా సంతోషమేసింది. అలాగే నేను వినయ్‌గారి ‘ఆది’ సినిమా చూసి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. అలా నా కెరీర్‌లో ఒక ఇంపార్టెంట్‌ పర్సన్‌ అయిన వినాయక్ గారు ఫోన్‌ చేసి అభినందించడం కూడా ఒక హై పాయింట్‌. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం మా వెన్నంటి ఉందటం అనేది గర్వించదగ్గ విష‌యం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments