'మ‌హ‌ర్షి' గురించి అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన వంశీ..!

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (13:48 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం మ‌హ‌ర్షి. ఇటీవ‌ల ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసారు. సక్సెస్‌‌లో పుల్‌స్టాప్‌లుండవ్.. కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అంటూ మహర్షి టీజర్ అద‌ర‌గొట్టింది. ఈ టీజర్‌తో రికార్డుల మోత మోగించారు. పంచ్ డైలాగులు, ఫైట్లతో తన అభిమానులకు విందు భోజనాన్ని అందించారు. ఇప్పటికే ఈ టీజర్ 15 మిలియన్ల వ్యూస్‌ను సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.
 
ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. అయితే... ఈ సినిమా గురించి డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఇంత‌కీ వంశీ ఏం చెప్పాడంటే... టీజర్‌ను సిద్ధం చేసేటప్పుడు నేను చాలా భయపడ్డాను. టీజర్‌లో ఎలాంటి సన్నివేశాలు పొందుపరచాలనే విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నాను. అయినప్పటికీ నేను చేసింది బాగుందా లేదా అని తెలుసుకోవడానికి చెక్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే విడుదల చేయడానికి ముందు మహేష్ సార్, దిల్ రాజు గారు సహా మా టీమ్‌ మొత్తానికి చూపించాను. వారి నుంచి మంచి స్పందన వచ్చింది. అంతే... నాకు కాన్ఫిడెన్స్ మ‌రింత పెరిగింది అన్నారు. 
 
ఇక సినిమాలో మహేష్‌బాబు పాత్ర ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త‌గా డిజైన్ చేసాను. మహేష్ చేసిన మూడు విభిన్నమైన‌ లుక్స్‌ను టీజర్‌లో చూపించాలని అనుకున్నాం. మహేష్‌బాబు పోషించిన రిషి పాత్ర ప్రయాణమే మహర్షి సినిమా. మనలో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రయాణం ఉంది. ఇదీ అంతే. సినిమాలో మూడు విభిన్న కాలాలు ఉంటాయి. అందుకే, మహేష్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారు అంటూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు డైరెక్ట‌ర్ వంశీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments