Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధే శ్యామ్ లో పంచ భూతాల సాంగ్ కు అనూహ్య స్పందన

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (16:57 IST)
Prabhas, Pooja Hegde
రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి ఈ రాతలే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసారు మేకర్స్. ఈ కలర్ ఫుల్ వీడియో సాంగ్ కు అనూహ్య స్పందన వస్తుంది. పాటను అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. 
 
ఈ పాట వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇందులో లో 5 అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం పంచ భూతాలుగా పిలుచుకునే నిప్పు, ఆకాశం, నీరు, భూమీ, గాలి.. ఈ లిరికల్ వీడియోలో చూపించారు. దీని కాన్సెప్టు ఏమిటంటే.. ప్రేమించే వాళ్ళ కోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి వాళ్లను చేరుకోవడం.
 
ఈ పాటలో హీరోయిన్ కోసం హీరో అలాంటి కష్టాలు పడతాడు. సినిమా విడుదలైన తర్వాత ఈ పాట గురించి పూర్తిగా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న ప్రశంసల కంటే అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 
 
రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా  వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. మార్చ్ 11, 2022న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
 
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..
 
టెక్నికల్ టీమ్:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్, నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌,  సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ), సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌, డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్, సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి,ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments