Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్ విక్రమ్ తొలిపాట‌కు ట్రెమండస్ రెస్పాన్స్

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (18:38 IST)
Vikram- Kamal Haasan
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్ 'యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌తో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ గా 'పతళ పతళ' అనే పాటని ఇటివలే విడుదల చేశారు. ఈ పాటకు అన్నివర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్  మాస్, బాస్ నెంబర్ గా ఈ పాటని డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్, మాస్ స్టెప్పులతో థియేటర్‌లలో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా వుంది 'పతళ పతళ' సాంగ్. ఈ పాటలో కమల్ హాసన్ తన మార్క్ డ్యాన్స్ మూవ్స్‌తో వింటేజ్ గ్రేస్‌ చూపించారు.  కమల్ హాసన్ ఈ పాట కు సాహిత్యం అందించడంతో పాటు ఆయనే పాటని ఆలపించడం మరో ప్రత్యేకత.
 
తాజాగా విక్రమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు నిర్మాతలు. మే 16 చెన్నైలో 'విక్రమ్' థియేట్రికల్  ట్రైలర్, ఆడియోని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
 
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి  విలన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ప్రధాన తారాగణంలో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించనున్ననారు.
 
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా,  గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా , ఫిలోమిన్ రాజ్  ఎడిటర్ గా పని చేస్తున్నారు.  
ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్దమౌతుంది.
 
తారాగణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments