జయం సినిమాలో వెళ్ళుబాబూ వెళ్ళు. అంటూ నితిన్‌తో అంటూ పాపులర్ అయిన నటి సదా కొన్ని సినిమాలు చేస్తూ గేప్ తీసుకుంది. లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్ల గొట్టింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా విక్రమ్‌తో అపరిచితుడు చేసి మరింత పాపులర్ అయింది. అయితే ఆ చిత్రం తర్వాత పెద్దగా అవకాశాలు ఎందుకనో తలుపుతట్టలేదు. ఎన్టీఆర్‌తో నాగ, బాలకృష్ణ వీరభద్ర చిత్రం చేశాక ఆమె కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ రెండు సినిమాలు డిజాస్టర్ కావడమే కారణం.
అయితే రజనీకాంత్ చంద్రముఖిలో జ్యోతిక పాత్ర కోసం సదాని అడగడం ఆమె బిజీగా వుండడంతో కుదరలేదు. ఆ తర్వాత షూటింగ్ గేప్ రావడంతో రజనీకి జోడీగా చేయమని ఆఫర్ వచ్చింది. కానీ సదా చేస్తున్న సినిమా దర్శక నిర్మాతలు అంగీకరించకపోవడంతో రెండోసారి వదులుకోవాల్సింది. దాని వల్ల నయనతార వెలుగులోకి వచ్చింది. ఇదే డెస్టినీ అంటే అంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మరోసారి తెలియజేసింది. ఈ విషయం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంటుందంటూ పేర్కొంది. ప్రస్తుతం టీవీ షోలకు పరిమితమైన ఈ భామ లేటెస్ట్‌గా చీరకట్టుతో నెటిజన్లను అలరించింది. ఈ పిక్‌లు చాలా బాగున్నాయంటూ నెటిజన్లు కితాబిచ్చేశారు.