Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్-2 సెట్స్‌లో క్రేన్ ప్రమాదం... ముగ్గురి మృతి.. శంకర్‌కు తీవ్ర గాయాలు

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (09:41 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్-2. ఈ చిత్రం షూటింగ్ శరవేరంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రం షూటింగ్‌లో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ముఖ్యంగా భారీ క్రేన్ ఒకటి విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చిత్ర దర్శకుడు ఎస్. శంకర్‌తో పాటు.. ఇద్దరు అసిస్టెంట్లతో సహా మొత్తం పది మందికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. 
 
కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘భారతీయుడు-2’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. కమల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్నారు.
 
శంకర్ దర్శకత్వంలో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతుండగా బుధవారం రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ ప్రమాదవశాత్తు తెగి కింది ఉన్న టెంట్‌పై పడింది. ఈ ఘటనలో టెంట్ కింద ఉన్న వారిలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడినవారిలో శంకర్ కూడా ఉన్నారు. 
 
క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ప్రమాదంపై స్పందించిన కమల్.. ఈ ఘటన తన మనసును కలచివేసిందన్నారు. ముగ్గురిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. వారి కన్నవారి కంటే తన బాధ ఎన్నో రెట్లు ఎక్కువని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments