Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోస్ట్‌గా నాగార్జున అదుర్స్.. కమల్‌ వద్దు.. ఆయన్ని డబ్బులిచ్చి తెచ్చుకోండి..

Advertiesment
హోస్ట్‌గా నాగార్జున అదుర్స్.. కమల్‌ వద్దు.. ఆయన్ని డబ్బులిచ్చి తెచ్చుకోండి..
, సోమవారం, 16 సెప్టెంబరు 2019 (14:38 IST)
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి రెండోసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన యాంకర్, నటి శిల్పా చక్రవర్తి ఆదివారం ఎలిమినేట్ అయ్యింది. నిజానికి శిల్ప రాకతో షో మరింత ఆసక్తిగా మారుతుందని అందరూ భావించారు. అయితే, ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. ఈ వారం శిల్పతోపాటు శ్రీముఖి, హిమజ, పునర్నవి, మహేశ్ విట్టాలు నామినేట్ అయ్యారు. 
 
వీరిలో అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న శిల్ప ఎలిమినేట్ కాక తప్పలేదు. కాగా, ఇప్పటి వరకు షో నుంచి ఎలిమినేట్ అయిన వారందరూ తొలిసారి నామినేట్ అయిన వారే కావడం గమనార్హం. గతంలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి కూడా హౌస్‌లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది.
 
వైల్డ్ కార్డుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శిల్పాకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయిందని నాగ్ ప్రకటించాడు. మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఇద్దరూ హౌస్‌లో రెండు వారలు మాత్రమే ఉండటం విశేషం. 
 
శనివారం ఇంటి సభ్యులకు గట్టిగానే క్లాస్ పీకిన నాగార్జున ఆదివారం వారితో సరదాగా టాస్క్‌లు ఆడించాడు. టాస్క్‌లు ఇచ్చిన నాగార్జున ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంటి సభ్యులను గ్రూపులుగా చేసి వారితో నాగ్ టాస్క్ చేయించాడు. చివరకు ఈ టాస్క్ లో 'శిల్ప-శ్రీముఖి' చేసిన టాస్క్ బావుందని నాగ్ కితాబిచ్చాడు. ఆదివారం ఎపిసోడ్ మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు హైలైట్ గా నిలిచింది.
 
పునర్నవి మీద రాహుల్ పాడిన పాటకు నాగ్ కూడా క్లాప్స్ కొట్టడం విశేషం. ఎలిమినేషన్ లో ఉన్న హిమజను సేఫ్ అయినట్లు శనివారమే ప్రకటించిన నాగ్ ఆదివారం శ్రీముఖి, మహేష్‌లు సేఫ్ అని ప్రకటించి శిల్ప ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. ఆ తరువాత స్టేజి మీదకు వచ్చిన శిల్ప హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకుంది. హౌస్ లో ఇంటి సభ్యులను శిల్ప చెప్పడంతో ఆసక్తి నెలకొంది.
 
మహేష్‌ను తిక్కలోడు, బాబా భాస్కర్‌ను జిత్తులమారి నక్క, శ్రీముఖిని శిల్ప అవకాశవాది అంటూ శిల్పా చక్రవర్తి చెప్పుకొచ్చింది. తరువాత హిమజని అహంకారి అని వితికాని గయ్యాలి అని వెల్లడించింది. పునర్నవిని మూర్ఖురాలుగా చెప్పిన శిల్ప కోపిష్టిగా రాహుల్ పేరు చెప్పింది. మొండోడుగా రవిని చూపిన శిల్ప అందాల రాక్షసిగా శివజ్యోతి పేరు చెప్పింది.
 
చివరలో నాగార్జున ఆమెకు హౌస్ మెట్ మీద 'బిగ్' బాంబ్ వేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ బాంబ్‌ను శిల్ప.. మహేష్ మీద వేసింది. దీని ప్రకారం డే టైమ్‌లో ఎవరు నిద్రపోయినా.. కుక్కలు అరిసినా మహేష్ స్విమ్మింగ్ పూల్‌లో దూకాలి.
 
ఇకపోతే.. ఈ వారం అక్కినేని నాగార్జున హోస్టింగ్‌లో అదరగొట్టాడని టాక్ వస్తోంది. తమిళ బిగ్ బాస్ కంటే.. తెలుగు బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున అదరగొట్టాడని నెట్టింట తమిళ తంబీలు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాకుండా తమిళ బిగ్ బాస్‌కి కూడా నాగార్జును డబ్బిచ్చి తెచ్చుకోండని కామెంట్లు చేస్తున్నారు. 
 
గతవారంలో ఓవరాక్షన్ చేసిన పునర్నవిపై నాగార్జున సీరియస్ కావడం.. షోకు హైలైట్ అయ్యింది. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ను బుల్‌షిట్‌ అని అంటావా? అంటూ పునర్నవిపై నాగ్‌ ఫైర్‌ అయ్యాడు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుందని శ్రీముఖిపై సీరియస్‌ అయ్యాడు. అంతేకాకుండా శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌వి కాదు.. ఈ హౌస్‌కు బిగ్‌బాస్‌ బాస్‌ అంటూ ఘాటుగా స్పందించాడు. దీంతో నాగార్జున చూసి హౌజ్ మేట్స్ అందరూ జడుసుకున్నారు. 
 
వీకెండ్‌లో హోస్ట్‌ నాగార్జున ఎపిసోడ్ ప్రారంభిస్తూ ఇంటి సభ్యులతో స్కిట్స్‌ను ఆడించాడు. శ్రీముఖి పెళ్లికూతురిగా నటించాలి. కాకపోతే పెళ్లి చూపుల రోజున ఆమె గొంతు మగవాడి గొంతులా మారిపోతుంది. పెళ్లి చూపుల సమయంలో శ్రీముఖి ఎలా హ్యాండిల్ చేసిందనే కాన్సెప్ట్‌తో స్కిట్ మొదలైంది. అత్తగా శిల్ప, పెళ్లికొడుకుగా మహేష్ విట్టా, స్నేహితుడిగా వరుణ్ సందేశ్ నటించాడు. శ్రీముఖి అద్బుతంగా నటించింది.  మరోవైపు శ్రీముఖి, వితిక షేరు, బాబా భాస్కర్ తిరుమల ఎపిసోడ్ కూడా హౌస్‌లోని సభ్యులని అలరించింది.  
 
శ్రీముఖి టాస్క్‌లో భాగంగా మాట్లాడుతూ పెళ్లి క్యాన్సిల్ అయితే చెప్పండి. నాకు నా బాయ్ ఫ్రెండ్ నాగార్జున ఉన్నాడని చెప్పటంతో నాగ్‌తో సహా అందరు విపరీతంగా నవ్వేశారు. శ్రీముఖి అంటూ నాగార్జున అనేసరికి సారీ సర్ అంటూ శ్రీముఖి చెప్పటం జరిగింది. ఇలా షోలో ఎక్కువ భాగం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేశారు. సో ఈ వారం నాగార్జున తన హోస్టింగ్‌తో అదరగొట్టాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ స్టీలు సామాన్లవాడికి బాగా నచ్చుతాయండీ..!!