Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి హేమనా.. మజాకా? హుండీలో రూ.10 వేసి.. రూ.20 వేల పట్టుచీర సొంతం

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (10:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు సినీ నటి హేమ తన చేతివాటాన్ని ప్రదర్శించారు. దుర్గమ్మ దర్శనం  కోసం బెజవాడకు వచ్చిన ఆమె... దుర్గమ్మ ఆలయం హుండీలో పది రూపాయలు వేసి...  20 వేల విలువ చేసే పట్టుచీరను పట్టుకెళ్లింది. అలాగే ఆలయంలో దర్శనం టిక్కెట్ కూడా తీసుకోకుండా వచ్చారు. అలాగే, అంశంపై ప్రశ్నల వర్షం కురిపించిన ఓ విలేఖరిపై ఆమె చిర్రుబుర్రులాడారు. 
 
సినీ నటి హేమ సోమవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు చేశారు. 
 
అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు రుసరుసలాడారు. దుర్గమ్మను దర్శించుకోలేకపోతానేమోనని అనుకున్నానని, కానీ అమ్మవారి దర్శనం లభించిందని, చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
జనం రద్దీ ఎక్కువగా ఉందని, ప్రొటోకాల్ ఇబ్బంది కూడా ఉందన్న వార్తలు విన్నానని, కానీ చివరి నిమిషంలో దుర్గమ్మ తనను పిలిచిందని పేర్కొన్నారు. లైవ్‌లో చూస్తూ దుర్గమ్మను స్వయంగా చూడలేకపోతున్న భక్తులకు కూడా పుణ్యం దక్కాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
 
ఈ సందర్భంగా అంతకుముందు ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హేమ కస్సుమన్నారు. మీరు ఎంతమంది వచ్చారని, అందరూ టికెట్ తీసుకున్నారా? అని ఆ విలేకరి ప్రశ్నించాడు. స్పందించిన హేమ ఆ రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అమ్మవారి హుండీలో తాను రూ.10 వేలు వేశానని, రూ.20 వేల విలువైన చీరను సమర్పించానని పేర్కొన్న హేమ.. టికెట్ గురించి మాట్లాడడం సరికాదన్నారు. టికెట్ తీసుకున్నామని, ప్రొటోకాల్ ప్రకారమే దర్శనానికి వెళ్తున్నామని అన్నారు. దీనిని కూడా వివాదం చేస్తారని అని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments