Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమ్లా నాయక్ లో డేనియల్ శేఖర్ గా రాణా గెట‌ప్ ఇదే

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (18:30 IST)
Rana Daggubati
పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
 
'భీమ్లా నాయక్' చిత్రం నుంచి ‘రాణా‘ పరిచయ చిత్రంను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేశారు చిత్ర బృందం. డేనియల్ శేఖర్ గా రాణా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్న దానికి ఈ ప్రచార చిత్రం ఓ కర్టెన్ రైజర్ లాంటిది. 
 
"నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్ నడుస్తోంది.
నేనెవరో తెలుసా ధర్మేంద్ర హీరో ..హీరో..!
డేనీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్...!"
అంటూ ఈ ప్రచార చిత్రం లో డేనియల్ శేఖర్ పాత్ర పలికే సంభాషణలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాయి.
 
ప్రస్తుతం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 
 
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం లో నిత్య మీనన్ నాయిక. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్, ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC, సంగీతం: తమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: సాగర్ కె చంద్ర

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది

Rainfall: బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన నివాస ప్రాంతాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments