దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 71వ పుట్టినరోజు వేడుకలను సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు హోం మంత్రి అమిత్ షాలు, ఇతర కేంద్ర మంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గురువారం అర్థరాత్రే ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యంగా, కేంద్ర మంత్రులతో సహా ప్రతిపక్ష నాయకులు ట్విట్టర్ వేదికగా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ తన జీవితంలో అనుక్షణం భారతదేశాన్ని బలంగా, సురక్షితంగా, స్వావలంబనగా మార్చడానికి అంకితం చేశారు. ఆయన నాయకత్వంలో దేశానికి సేవ చేయడం నా అదృష్టం. నేడు నేను దేశ ప్రజలందరితో కలిసి ప్రధాని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.
కాగా, 1950 సెప్టెంబర్ 17వ తేదీన జన్మించిన ప్రధాని మోడీ... 2001-14 మధ్యకాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నాటి సీఎం కేశూభాయి పటేల్ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడీకి అధికార పగ్గాలు లభించాయి. అక్కడ నుంచి ఆయనకు తిరుగులేకుండా పోయింది.
2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాలుగోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.
ఆ తర్వాత 2016లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించి మరోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్సేతర పార్టీలకు చెందిన ఒక పార్టీకి చెందిన నేత వరుసగా ప్రధానమంత్రి కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.