జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన పారాలింపిక్స్ పోటీల్లో భారత అథ్లెట్స్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 19 పతకాలు సాధించారు. ఇందులో ఐదు బంగారు పతకాలు ఉన్నాయి. ఈ పోటీల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లను ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. భారతదేశం గర్వపడేలా చేశారంటూ కితాబిచ్చారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారితో ప్రధాని మోడీ ఆదివారం సమావేశమయ్యారు.
ఈ సమయంలో ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. ఈమేరకు పీఎం వారి మనోబలాన్ని పెంపొందించారు. మీరు చాలా కష్టపడ్డారు అని ధైర్యం చెప్పారు. మీరు మా ఆటను ఐదు రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లారని, ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేదంటూ క్రీడాకారులు ప్రధానికి కితాబిచ్చారు.
ఒక ఆటగాడు పీఎం మోడీతో ఓడిపోయినందుకు చింతిస్తున్నానని చెప్పాడు. కానీ ఈ ఓటమి అతడిని మరింత బలోపేతం చేసింది. మరోసారి గెలిచేందుకు మా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆటలో ఓడిపోయిన ఆటగాళ్ల ధైర్యాన్ని పెంపొందిస్తూ, ఓడిపోవడం ద్వారా గెలవడమే మా అతిపెద్ద బలం అని ప్రధాని అన్నారు.