Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ఏడవకండి.. ఏం పర్లేదు.. నిరాశ చెందవద్దు.. మహిళా హాకీ జట్టుకు మోదీ ఫోన్ కాల్

Advertiesment
Indian hockey women team
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (15:13 IST)
Indian Hockey Team
భారత మహిళా హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 4-3 తేడాతో భారత్‌పై బ్రిటన్ విజయం సాధించింది. ఫలితంగా కాంస్యం కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు పోరాడి ఓడింది. సాధారణంగా మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపితే అది మామూలే. కానీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, ఆటగాళ్ల మనోబలాన్ని కాపాడుకోవడం ఆయన మరిచిపోలేదు. ఇవాళ కాంస్య పతకం గెలుచుకున్న తర్వాత భారత మహిళల హాకీ జట్టు ఆటగాళ్లందరితో ప్రధాని మోడీ మాట్లాడారు. 
 
సుమారు 3 నిమిషాల కాల్ సమయంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కెప్టెన్ రాణి రాంపాల్, మహిళల హాకీ క్రీడాకారులు అందరినీ అభినందించారు. టోర్నీలో సమిష్టి కృషితో రాణించారని కితాబిచ్చారు. చెమటోడ్చిన ఫలితమే దేశంలోని కోట్లాది మంది అమ్మాయిలు హాకీ ఆడటానికి ప్రేరణ పొందుతారు. దీని తరువాత, టోర్నమెంట్ అంతటా అత్యున్నత నాణ్యత గల హాకీని అందించిన ఆటగాళ్లందరికీ, కోచ్‌లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 
 
దీని తర్వాత ప్రధాని నవనీత్ గాయం గురించి ప్రస్తావించారు. దీనికి, కెప్టెన్ రాణి రాంపాల్ తనకు నాలుగు కుట్లు వేసినట్లు సమాధానమిచ్చారు. తన కంటిలో ఏమైనా సమస్య ఉందా అని ప్రధాని అడిగారు. నవనీత్ కన్ను బాగుందని రాణి సమాధానమిచ్చింది. దీని తర్వాత ప్రధాన మంత్రి వందన కటారియా, ఇతర క్రీడాకారులను ప్రశంసించారు. 
 
ప్రధాని ఫోన్ కాల్ చేయడంతో మహిళా క్రీడాకారిణులు భావోద్వేగానికి లోనయ్యారు. పసిడి పతకం సాధించలేకపోయామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఏడుపు ఆపమని వారిని కోరారు. నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ జట్టు కృషి కారణంగా, ఈ దేశానికి గుర్తింపుగా నిలిచిన హాకీ మళ్లీ పుంజుకుంటుందన్నారు. ఈ కాల్ సమయంలో, జట్టు గోల్ కీపర్ సవితా పునియా ఏడుస్తూ కనిపించింది. 
 
చివరికి, భారత మహిళా జట్టు కోచ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సమయంలో అమ్మాయిలు చాలా భావోద్వేగంతో ఉన్నారని, హాకీ జట్టుకు అన్ని విధాలుగా సహాయం చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజీవ్ ఖేల్ ‌రత్న మాయం.. ఇకపై ధ్యాన్‌చంద్ర ఖేల్‌రత్నగా మార్పు