టోక్యో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా అద్భుతం చేశాడు. 65కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో కజక్‌స్థాన్‌కు చెందిన అక్మత్ అలీని 3-3 తేడాతో ఓడించాడు.
వీరిద్దరి మధ్య పోరు ఫైనల్‌ను తలపించింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. మొదటి పిరియడ్‌లో బజరంగ్ టచ్‌డౌన్ ద్వారా 1 పాయింట్ అందుకున్నాడు.
మరో సారి ప్రత్యర్థిని రింగు బయటకు పంపించి 2 పాయింట్లు సంపాదించి 3-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రత్యర్థికి 1 పాయింటు లభించింది. అయితే రెండో పిరియడ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. బజరంగ్‌ను అక్మత్ లాక్ చేసినా అతడు తప్పించుకొన్నాడు.
అక్మత్ 2 పాయింట్లు సాధించి స్కోరును 3-3తో సమం చేసినా ఒక దఫాలో బజరంగ్ ఒకేసారి 2 పాయింట్లు అందుకోవడంతో విజయం అతడినే వరించింది. క్వార్టర్ ఫైనల్లో అతడు ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మొర్తజాతో తలపడతాడు.