Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ, అనిల్ రావిపూడి NBK108కి థమన్ మ్యూజిక్

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (18:04 IST)
NBK108 poster
గాడ్ ఆఫ్ మాసస్  నటసింహ నందమూరి బాలకృష్ణ, డబుల్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారిగా జతకడుతున్న క్రేజీ కాంబినేషన్ కు సర్వం సిద్ధమైయింది. #NBK108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. ఈరోజు చిత్ర నిర్మాతలు, సంగీత దర్శకులకు సంబధించిన ప్రకటన వచ్చింది.
 
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి,  హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ కాంబినేషన్ ఖచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయం.
 
అనిల్ రావిపూడి, థమన్ కలసిపని చేయడం ఇదే తొలిసారి. కాగా, బాలకృష్ణ సెన్సేషనల్ హిట్ అఖండకు థమన్ బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా “త్వరలో బాంబార్డింగ్…” అంటూ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభానికి సంబంధించి అనౌన్స్ మెంట్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. అనౌన్స్ మెంట్ వీడియోకి తమన్ ఇచ్చిన బిజీయం మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంది. అనౌన్స్ మెంట్  బిజీఎంనే అదిరిపోయిందంటే.. సినిమాలో ఏ స్థాయిలో వుంటుందనే ఎక్సయిట్మెంట్ ప్రేక్షకుల్లో కలిగించారు.
 
మాస్‌ పల్స్‌ తెలిసిన అనిల్‌ రావిపూడి బాలకృష్ణ కోసం విభిన్నమైన, మాస్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. నటసింహ నందమూరి బాలకృష్ణని మునుపెన్నడూచూడని పాత్రలో చూపించబోతున్నారు.
 
ఇందులో ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తుంది. #NBK 108 కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు.
 
తారాగణం: నందమూరి బాలకృష్ణ
సాంకేతిక విభాగం-  రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్, సంగీతం: ఎస్ థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments