Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లెహ‌రాయి నుండి పాటను విడుద‌ల చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi, Ghantadi Krishna and others
, బుధవారం, 10 ఆగస్టు 2022 (17:35 IST)
Anil Ravipudi, Ghantadi Krishna and others
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో హీరో రంజిత్, సౌమ్య మీనన్ జంట‌గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ ముఖ్య‌తారాగాణం గా,  ప్రముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన రామకృష్ణ పరమహంస ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ ఫ్యాష‌న్ తో సినిమా రంగంలోకి అడుగెట్టిన మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం "లెహరాయి.  ఈ చిత్రం  టైటిల్ ప్రాచుర్యం కావ‌టం విశేషం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటుంది.
 
నువ్వు ఏడికొస్తే ఆడికెల్తా సువ‌ర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువ‌ర్ణ అంటూ 90 స్ లో ట్రెండింగ్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు  ఘంటాడి కృష్ణ ఈ చిత్రం తో జికే ఈజ్ బ్యాక్ అన్న‌ట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల‌య్యిన గుప్పెడంత సాంగ్ ఆర్గానిక్ గా మిలియ‌న్ వ్యూస్ రావ‌టం, ఆ సాంగ్ ని వంద‌ల్లో రీల్స్ చేయ‌టం ఈ సాంగ్ పాపులారిటి తెలుస్తుంది. ఈ స‌క్స‌స్ ని పురస్క‌రించుకుని లెహ‌రాయి చిత్రం నుండి రెండ‌వ సాంగ్ ని కూడా విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ని యావ‌త్ సౌత్ ఇండియాని ఊపేస్తున్న టాలెంటెడ్ ట్రెండి సింగ‌ర్ సిధ్ధ్ శ్రీరామ్ ఆల‌పించారు. తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ "అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ" ను రిలీజ్ చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
 
ఈ చిత్రం లో మొత్తం 7 సాంగ్స్ వున్నాయి. ప్ర‌తిసాంగ్ అల‌రించే విధంగా వుంటుంది. మంచి ఫీల్ వున్న క‌థ లో చిత్రాన్ని తెర‌కెక్కించాను. త్వ‌ర‌లో రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయనున్నట్లు.  ప్ర‌ముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగొపాల్ గారు స‌మ‌ర్పించ‌డం చాలా ఆనందం గా వుందని ఇదివరకే ద‌ర్శ‌కుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కథలని బ్యాంకు లాకర్‌లో ఉంచిన్నట్లు దాచుకుంటా - సముద్రఖని