Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ న‌టిస్తున్న‌ పులి-మేక వెబ్ సిరీస్‌ ప్రారంభం

Advertiesment
Bobby clapped Lavanya Tripathi, Adi Saikumar
, శనివారం, 18 జూన్ 2022 (17:32 IST)
Bobby clapped Lavanya Tripathi, Adi Saikumar
జీ5 అసోసియేషన్ విత్  కోన ఫిలిం కార్పోరేషన్ చేస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ “పులి - మేక”.  లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటించడం విశేషం. గోపీచంద్ హీరో గా ‘పంతం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె చక్రవర్తి రెడ్డి మెగాఫోన్ పట్టారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ & ZEE5 వారు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌ కథాంశం తో తెరకెక్కిస్తున్న 'పులి - మేక ’  వెబ్ సిరీస్ పూజ కార్యక్ర మాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  వచ్చిన దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. 
 
పూజ కార్యక్రమాల అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ..ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా సినిమాల తో పోటీ పడుతున్నాయి.మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా  వెబ్ సిరీస్ లకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సినిమా హీరోలు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు.ఈ పులి - మేక  వెబ్ సిరీస్ లలో లావణ్య త్రిపాఠి,  ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ "పులి - మేక"  వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే పోలీసు డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ ఇది. పోలీస్ డిపార్టుమెంట్ లోని పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకరు చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలు మరియు ఆస్ట్రాలజీ తో మిళితమైన కథాంశం ఉండటం ఈ వెబ్ సిరీస్ కథలో ఉన్న ప్రత్యేకత ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్ లాగే ఇది కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు
తారాగణం:
లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ తదితరులు.
 
దర్శకత్వం  :  చక్రవర్తి రెడ్డి . K,  కెమెరా :  సూర్య కళా, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటర్  : చోటా కె ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి, కౌముది నేమాని,  మ్యూజిక్ :  ప్రవీణ్ లక్కరాజు,  కథా రచయిత : కోన వెంకట్ , వెంకటేష్ కిలారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హృతిక్ రోషన్ అమ్మమ్మ పద్మారాణి కన్నుమూత