Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుబాల ప్రత్యేక పాత్రలో ప్రేమదేశం

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (17:44 IST)
Megha Akash, Madhubala
త్రిగున్, మేఘా ఆకాష్, జంటగా నటిస్తున్న చిత్రం  ప్రేమదేశం. మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలకు  ఇటీవలే విడుదలైన టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ 
1996లో విడుదలై పెద్ద సూపర్ హిట్ సాధించిన" ప్రేమదేశం" సినిమా అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుని ఉర్రూతలూగించింది. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు దాదాపు దశాబ్దంపాటు ఎక్కడ చూసినా వినపడుతూ ఉండేవి. చాలా కాలం తర్వాత ఈ 2022 లో అదే టైటిల్ తో  వస్తున్న  "ప్రేమదేశం' సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన నాటి "ప్రేమదేశం" సినిమాకు ఏఆర్ రహమాన్ ప్రాణం పోస్తే.. నేడు మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తోను సంగీతం తోను అంతే ప్రాణం పోశాడు అని చెప్పాలి. చిత్ర యూనిట్ విడుదల చేసిన "ప్రేమదేశం" టీజర్ కు  అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇందులోని "పదములే లేవు పిల్ల" పాట కూడా అన్ని మాధ్యమాలలో టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇందులో నటించిన  వారందరూ కొత్తవారైనా చాలా చక్కగా నటించారు.

టీజర్ ని చూస్తే చాలా ఫ్రెష్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఎట్రాక్టివ్ గా కనిపించింది.  వెటరన్ నటి  మధుబాల గారి మీద వచ్చే ఆ టీజర్ చివరిలో సినిమా మీద ఇంకా ఆశక్తి పెంచింది. ఆవిడతో పాటు విలక్షణ నటుడైన తనికెళ్ల భరణి గారు ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మేఘా ఆకాష్ అందం, మిగత నటి నటుల కొత్తదనం, మణిశర్మ గారి పాత్రలు, ఛాయాగ్రహుడి పనితనం, కొత్త దర్శకుడైనా కూడా ఔట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా   ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కచ్చితంగా అలరిస్తుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో లో చిత్రీకరించబడుతున్న ఈ సినిమా  షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments