Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్.. గంగవ్వ ప్లేసులో జబర్దస్త్ నటుడు.. మోనాల్ గజ్జర్‌ను ఎలిమినేట్ చేస్తారా?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (20:55 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మోనాల్ గజ్జర్ గ్లామర్ షో పండించినా.. తెలుగు బిగ్‌బాస్ గత సీజన్‌లతో పోల్చుకుంటే ఈ బిగ్‌బాస్-4లో సెలబ్రిటీల కొరత వుందనే చెప్పాలి. యాంకర్ లాస్య, హీరోయిన్ మోనాల్ గజ్జర్, గంగవ్వ, నోయల్ మినహా పెద్దగా తెలిసిన ముఖాలేమీ లేవనే చెప్పాలి. అందుకే మొదట్లో బిగ్‌బాస్-4 షో పెద్దగా రక్తి కట్టలేదు.
 
గంగవ్వ మాత్రమే ఆ షోకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక అవినాష్ ఎంట్రీ తరువాత బిగ్‌బాస్-4లో కాస్త నవ్వులు పండుతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ పంచడమే లక్ష్యంగా అవినాష్‌ని వైల్‌కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి పంపించారు నిర్వాహకులు.
 
అందుకు తగ్గట్టుగానే అవినాష్ నవ్వించడానికి ప్రయత్నిస్తూ.. మంచి మార్కులే కొట్టేస్తున్నాడు. కాగా ఇటీవల అనారోగ్య సమస్యతో హౌస్‌నుండి బయటికి వచ్చిన గంగవ్వ ప్లేస్‌లో మరో కమెడియన్‌ను పంపించడానికి బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. జబర్థస్త్ షో ద్వారా పాపులరైన మరో కమెడియన్ హౌస్‌లోకి వచ్చేవారం వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టబోతున్నాడని సమాచారం. అతనెవరో తెలియాలంటే.. కాస్త వెయిట్ చేయాల్సిందే. 
 
అలాగే బిగ్ బాస్ సీజన్ 4లో వన్ ఆఫ్ ది స్టార్ కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చింది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. హౌజ్ లోకి వచ్చిన మొదటి వారంలోనే అటు అఖిల్ ఇటు అభిజిత్ ఇద్దరితో ఆమె క్లోజ్‌గా మూవ్ అయ్యింది. అభిజిత్ నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావ్ అని మొహం మీద చెప్పినా సరే ఆమె ఇంకా ఏదో ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. కచ్చితంగా హౌజ్‌లో అఖిల్, అభిజిత్‌ల మధ్య గొడవకు మూల కారణం మోనాల్ అన్నది అందరికి తెలిసిందే. మోనాల్ కోసం ఆ ఇద్దరు గొడవపడటం.. ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి.
 
ఇదంతా ఆడియెన్స్‌కు నచ్చట్లేదు. అందుకే దాదాపు ఈ వారం మోనాల్‌కు బై బై చెప్పేస్తున్నారని అంటున్నారు. ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది దాకా నామినేషన్స్‌లో ఉన్నారు. వారిలో మోనాల్‌తో పాటుగా హారిక, నోయెల్ రిస్క్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి మోనాల్ నిజంగానే బయటకు వస్తుందా లేక బిగ్ బాస్ హౌజ్‌లో ఇలాంటి గొడవలు కావాలి కాబట్టి ఆమెను మరికొద్దిరోజులు ఉంచుతారా అన్నది తెలియాల్సి ఉంది. మోనాల్ వెళ్తే అఖిల్ తన ఆట మీద మరింత ఫొకస్ పెట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments