Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సునామీ సుధాకర్ హైలైట్.. బతుకుమ్మ పాటకు జబర్దస్త్ టీమ్ సూపర్ డ్యాన్స్ (video)

Advertiesment
సునామీ సుధాకర్ హైలైట్.. బతుకుమ్మ పాటకు జబర్దస్త్ టీమ్ సూపర్ డ్యాన్స్ (video)
, మంగళవారం, 13 అక్టోబరు 2020 (17:01 IST)
Jabardasth team
బతుకమ్మ పండగ వచ్చేస్తుందంటే తెలంగాణ ప్రాంతం అంతా కన్నుల పండగగా మారిపోతుంది. ప్రతీసారి కొందరు ప్రత్యేకంగా బతుకమ్మ పాటలను కంపోజ్ చేస్తుంటారు.. మరికొందరు వాటికి ఆడిపాడుతుంటారు. ప్రతీయేటా కూడా ఇదే జరుగుతుంటుంది. ఇప్పటికే మంగ్లీ, మధుప్రియ లాంటి వాళ్లకు బతుకమ్మ పాటలకు మంచి డిమాండ్ ఉంది. దాంతో పాటు కొన్ని న్యూస్ ఛానెల్స్ కూడా బతుకమ్మ కోసం ప్రత్యేకంగా పాటలు రాయించి కంపోజ్ చేయిస్తుంటాయి. 
 
ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ కూడా అంతా కలిసి ఓ పాటను చేసారు. అది యూ ట్యూబ్‌లో బాగానే వైరల్ అవుతుంది. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేసుకునే సాయిలేఖ, వినోద్, శాంతి స్వరూప్ సహా మరో ముగ్గురు నలుగురు అదే గెటప్స్‌లో బతుకమ్మ పాటలో కనిపించారు.. కనువిందు చేసారు.
 
ఈ పాటలో సునామీ సుధాకర్ హైలైట్ అయ్యాడు. ఆయనపైనే పాట అంతా షూట్ చేసారు. డాన్సులు చేయడం.. పాట పాడటం అంతా సుధాకర్ చూసుకున్నాడు. ఇక కుండలు పట్టుకుని రావడం.. బతుకమ్మకు పూలు అల్లడం.. చిందేయడం లాంటివి అన్నీ మిగిలిన లేడీ గెటప్స్‌లో ఉన్న వాళ్లు చూసుకున్నారు. 
 
నిండు ముత్తైదువుల్లా ఈ పాటను వాళ్లు పూర్తి చేసారు. మధ్యలో పల్లె అందాలు.. పడుచుల సొగసులు.. తంగిడిపూల బతుకమ్మలు ఇవన్నీ బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది ఎన్ని పాటలు వచ్చినా కూడా జబర్దస్త్ బతుకమ్మ పాట అంటూ ఇది మాత్రం బాగానే వైరల్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రోమోతో బాగానే ఆకట్టుకున్న వీళ్లు.. రేపు పూర్తి పాట వచ్చిన తర్వాత మరింత మాయ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో మాల్దీవుల్లో మజా చేస్తున్న సొట్టబుగ్గల సుందరి!