నువ్వు-నేను చిత్రంతో పాపులర్ అయిన నటి అనిత గుర్తుందా. ఆమె ఏడేళ్ల క్రితం రోహిత్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా తను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్తతో కలిసి ఆమె ఓ స్పెషల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసారు.
ఈ వీడియోలో తనకు రోహిత్‌తో కలిగిన పరిచయం, ప్రపోజ్ చేయడం, పెళ్లి ఆ తర్వాత ప్రెగ్నెంట్ ఇలా అన్ని విషయాలను క్రోడీకరించి అందులో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.