Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ ఎస్కేప్ : రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన హీరో రాజశేఖర్

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (09:13 IST)
సినీ హీరో డాక్టర్ రాజశేఖర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బుధవారం తెల్లవారు జామున జరిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్, అవుటర్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ వద్ద హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు ప్రమాదానికి గురైంది. 
 
ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. వీరిద్దరికీ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణగండం తప్పింది. కానీ, ఈ ప్రమాదంలో కారు మాత్రం నుజ్జునుజ్జు అయింది. 
 
అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరానప్పటికీ.. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు.. రాజశేఖర్ కాళ్లు, చేతులకు గాయాలు అయినట్టు సమాచారం. కారులో వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. 
 
విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వెళ్లిన రాజశేఖర్, ఆ కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తూ రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత, సిటీలోకి రాకుండా, నేరుగా జూబ్లీహిల్స్‌కు చేరుకునే క్రమంలో అవుటర్‌పై ప్రయాణించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments