Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎక్స్ 100 హీరో '90 ఎంఎల్ విడుద‌ల తేదీ ఖ‌రారు

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (21:18 IST)
'ఆర్‌ఎక్స్100' ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన '90 ఎం.ఎల్‌` రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. డిసెంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది. ఈ చిత్రంతో శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. 'ఆర్‌ ఎక్స్100'తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్‌ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి కథానాయిక. 
 
ఈ చిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్‌ని శ్రీ వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కి సొంతం చేసుకుంది. నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ... ``ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం అన్నీ స‌వ్యంగా జ‌రుగుతున్నాయి. షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. 90.ఎంఎల్ అనే టైటిల్ కి త‌గ్గ‌ట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంది. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగుతుంది. విజువ‌ల్‌గానూ రిచ్‌గా ఉంటుంది. 
 
రీసెంట్‌గా అజ‌ర్‌బైజాన్‌లో మూడు పాట‌లు చిత్రీక‌రించాం. సినిమా గురించి మంచి పాజిటివ్ బ‌జ్ స్ప్రెడ్ అయింది. శ్రీ వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫ‌ర్ కి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. డిసెంబ‌ర్ 5న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం`` అని అన్నారు.
 
దర్శకుడు శేఖర్‌ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ... ``ఆర్‌.ఎక్.100లో కార్తికేయ‌ను చూడ‌గానే 90 ఎంఎల్ స్క్రిప్ట్ కి ప‌క్కాగా స‌రిపోయే హీరో అనిపించింది. డిసెంబ‌ర్ 5న థియేట‌ర్ల‌లో సినిమా చూసిన వారు కూడా కార్తికేయ‌కు టైల‌ర్ మేడ్ కేర‌క్ట‌ర్ అని ఫిక్స‌వుతారు. రీసెంట్‌గా అజ‌ర్‌బైజాన్ లో మూడు పాట‌ల‌ను చిత్రీక‌రించాం. ఆ పాట‌లు సినిమాకు హైలైట్ అవుతాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. యూత్‌ఫుల్‌గా సాగే సినిమా ఇది`` అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments