Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ జయంతి.. తారక్ భావోద్వేగ ట్వీట్.. గుండె తల్లడిల్లిపోతోంది..

Webdunia
గురువారం, 28 మే 2020 (11:32 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని... తారక్ భావోద్వేగ ట్వీట్ చేశారు.  ఆయనతో తమ తీపి గురుతులను గుర్తు చేసుకుంటూ ఆయన వారసులు ఉద్వేగానికి గురవుతున్నారు. ఆయన సమాధి వద్ద శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మనవడు, దివంగత హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా బాగా ఎమోషనల్ అయ్యాడు. 
 
ఎన్టీయార్ జయంతి సందర్భంగా తాతకు నివాళులర్పించిన ఎన్టీయార్ ట్విట్టర్ ద్వారా తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. ''మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను'' అంటూ ఎన్టీయార్ ఫొటోను పోస్ట్ చేశాడు.
 
''మీరు లేని లోటు తీరనిది..'' అని పేర్కొన్నాడు. తాత ఫోటో దగ్గర తానున్న ఫోటోను షేర్ చేశాడు. ఈ మధ్యే పుట్టినరోజు జరుపుకున్న ఎన్టీఆర్‌కు మిలియన్ల కొద్దీ బర్త్ డే విషెస్ ట్వీట్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీంగా తారక్ నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

Upasana-తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం గవర్నర్ల బోర్డు.. సహ-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments