Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు జాతి పౌరుషం ఎన్టీఆర్ : మెగాస్టార్ చిరంజీవి

Advertiesment
తెలుగు జాతి పౌరుషం ఎన్టీఆర్ : మెగాస్టార్ చిరంజీవి
, గురువారం, 28 మే 2020 (10:15 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు 97వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఆ మహానటుడ్ని స్మరించుకున్నారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
'తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ  చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..' అని  వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఎన్టీఆర్, చిరంజీవి కలసి 'తిరుగులేని మనిషి' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలో 'యవ్వనం... ఒక నందనం' అంటూ సాగా పాటలో కలిసి ఆడారు కూడా. పైగా, ఓ కార్యక్రంలో ఎన్టీఆర్ పాల్గొని చిరంజీవికి స్వయంగా కేకు తినిపించారు. ఆ ఫోటోను ఇపుడు చిరంజీవి తన ట్వీట్‌కు జతచేశారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్ డౌన్‌లో ఇంత దారుణమా, సూపర్ స్టార్ రజినీకాంత్ ఆవేదన