Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరు లేని లోటు తీర్చలేనిది... ఎన్టీఆర్ అంటేనే ఓ స్ఫూర్తి : చంద్రబాబు

Advertiesment
మీరు లేని లోటు తీర్చలేనిది... ఎన్టీఆర్ అంటేనే ఓ స్ఫూర్తి : చంద్రబాబు
, గురువారం, 28 మే 2020 (09:36 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు 97న జయంతి వేడుకలు గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మామగారైన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్‌ను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని బాబు ఓ ట్వీట్ చేశారు. 
 
"ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది సామాన్యులకు అండగా నిలిచిన మేరునగ ధీరుడు నందమూరి తారకరామారావుగారు. ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. ఆయన కృషి, క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ది, దీక్షాదక్షత ప్రతి ఒక్కరికీ  మార్గదర్శకం" అని అన్నారు.
 
ఆపై "ఎన్టీఆర్ మానవతా దృక్పథం, సేవానిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం... తరతరాలకు ఆదర్శమే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం. "సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ల"ని చాటుదాం" అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
webdunia
 
అలాగే, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కొద్దిసేపటి క్రితం నివాళులు అర్పించారు. బాలకృష్ణతో పాటు రామకృష్ణ, సుహాసిని తదితరులు ఎన్టీఆర్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో తెలుగుదేశం అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్‌టిసి బస్సులో మహిళ ప్రసవం