Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ సినిమాలో న‌టిస్తున్న త‌మిళ న‌టుడు ఎవ‌రు..?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (20:19 IST)
`డాన్‌శీను`, `బ‌లుపు` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొంద‌నుంది. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ర‌వితేజ 66వ చిత్ర‌మిది. ర‌వితేజ ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. 
 
గ‌తంలో ర‌వితేజ పోలీసాఫీస‌ర్‌గా న‌టించిన చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంద‌ట‌. అయితే... ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌కు ఎవ‌రైతే బాగుంటారా అని ఆలోచించి ఆఖ‌రికి... ద‌ర్శ‌క‌త్వం నుండి న‌ట‌న వైపు అడుగులేసి విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకుంటూ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న స‌ముద్ర‌ఖ‌నిని ఎంపిక చేసార‌ట‌. 
 
బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మ‌రోసారి శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌రి... ఇటీవ‌లి కాలంలో వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మౌతున్న ర‌వితేజ ఈ సినిమా అయినా స‌క్స‌ెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments