అన్న బాటలోనే తమ్ముడు.. పార్టీని నాదెండ్ల మనోహర్ పైన వేసేసి?

మంగళవారం, 15 అక్టోబరు 2019 (20:40 IST)
జనసేన పార్టీతో గత ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్‌. గెలిచిన సీటు ఒకటే అయినా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణమయ్యారు పవన్ కళ్యాణ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తరువాత పార్టీలో చురుగ్గా లేకుండా పోయిన పవన్ కళ్యాణ్‌ మళ్ళీ ఇప్పుడు సినిమాల వైపు అడుగులు వేస్తున్నారట. 
 
ఎందుకంటే ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. దాంతో పాటు ఎన్నికల తరువాత పార్టీని నమ్ముకున్న వారందరూ ఒక్కొక్కరుగా దూరమవుతూ వస్తున్నారట. అందుకే జనసేనాని సినిమాల్లో నటించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రిష్‌‌తో ఒక సినిమా చేసేందుకు సిద్థమయ్యారట. అంతేకాదు క్రిష్ ఇప్పటికే ఒక కథను వినిపించడంతో పవన్ కళ్యాణ్‌ ఆ కథ నచ్చి సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట.
 
ఇక రాజకీయాలకు బ్రేక్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారట. తన స్నేహితుడు, జనసేన పార్టీ కీలక నేత మనోహర్‌కు పార్టీ పూర్తి బాధ్యతలను అప్పజెప్పి తాను సినిమాల్లో నటిస్తే ఎలా వుంటుందని యోచన చేస్తున్నారట పవన్ కళ్యాణ్‌. ఇదే విషయం పార్టీలోను తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్‌‌ను రాజకీయాల్లో అభిమానించేవారు దూరమైపోయే అవకాశం ఉందన్న మరో ప్రచారం జరుగుతోంది. మరి ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచు చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కేరాఫ్ కంచరపాలెం, గుట్టు చప్పుడు కాకుండా శ్మశానికి యువతి మృతదేహం... ఏం జరిగింది?