తమన్నా అదుర్స్, అద్భుతం అంటున్న చిరంజీవి, మరి నయనతార?

శనివారం, 12 అక్టోబరు 2019 (21:53 IST)
సైరా నరసింహా రెడ్డి చిత్రం విజయవంతమైంది. మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌లో వున్నారు. ఇప్పుడు చిరు ఎక్కడికెళ్లినా ఆయన చుట్టూ మూగేస్తున్నారు. ఎవరు వచ్చినా ఆయన్ను సైరా గురించే అడుగుతున్నారు. కెరీర్లో తనకు బాగా తృప్తినిచ్చిన చిత్రాల్లో సైరా చిత్రం ఒకటని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రమోషన్ సమయంలో నయనతార మొండిచెయ్యి చూపించింది. తను చిత్రం ప్రమోషన్లకు వస్తే ఆ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతున్నాయనీ, అందువల్ల సెంటిమెంటుగా తను చిత్ర ప్రమోషన్లకు దూరంగా వున్నట్లు చెప్పింది. 
 
ఐతే మెగాస్టార్ చిరంజీవి మాత్రం నయనతార పేరెత్తకుండానే మెత్తగా తిట్టేశారు. తమన్నా గురించి మాట్లాడుతూ... తమన్నా అద్భుతం, తన నటన సంగతి పక్కన పెడితే ఆమె నటన ఎంతో బావుందని ఆకాశానికెత్తేశారు. మొత్తమ్మీద మెగాస్టార్ చిరంజీవికి నయనతారపై బాగా గుర్రుగా వున్నట్లే వున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆర్టీసి సమ్మె: అనుభవం లేని డ్రైవర్లు, బస్సు వెనుక చక్రం ఊడటంతో ప్రయాణికుల బెంబేలు