Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

దేవీ
గురువారం, 28 ఆగస్టు 2025 (15:17 IST)
Amar Deep Chowdhury, Sayali
అమర్ దీప్ చౌదరి, సయాలీ జంటగా నటిస్తున్న చిత్రం సుమతీ శతకం. ఎం. ఎం. నాయుడు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ ప్రత్యేక పాత్రలు పోషించారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు.
 
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్‌తో సుమతీ శతకం ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. హీరో హీరోయిన్ కారెక్టర్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వినాయక చవితి సందర్భంగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో హీరోయిన్లను చూస్తుంటే ఏదో ఫన్నీ, క్యూట్, ఫ్యామిలీ, లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది.
 
సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. నహిద్ ముహమ్మద్ ఎడిటర్‌గా, హాలేష్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కథను బండారు నాయుడు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments